ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇపుడు అందరినీ ఆకట్టుకుంటున్న ఒకే ఒక సీటు గాజువాక. ఇక్కడ నుంచి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్నారు. ఆయన పోటీలో ఇక్కడ రాజకీయ చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. పవన్ గాజుగ్లాస్ లోకి గాజువాక వచ్చేసిందా. పవన్ గెలుపు సునాయాసమా. ఆయన ఎంత మెజారిటీతో గెలుస్తారు. ఆయనకు స్పీడ్ బ్రేకర్లేమిటి అన్న చర్చ కూడా సాగుతోంది.


ఉత్తరాంధ్ర రాజకీయాలను చూస్తే వెనకబడిన ఈ జిల్లాలకు వలస నాయకులు వస్తూంటారు. అందులో ఆశ్చర్యం లేదు కానీ సినిమా సెలిబ్రిటీలు వచ్చి పోటీ చేయడం అరుదైన విషయం. అపుడెపుడో  అంటే 1994 ఎన్నికలపుడు తెలుగుదేశం అధినేత నందమూరి తారక రామారావు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి అసెంబ్లీకి పోటీ చేశి గెలిచారు. అంతకు ముందు ఆయన విశాఖ జిల్లా భీమిలి నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే చివరి నిముషంలో టెక్కలికి షిఫ్ట్ అయ్యారు. అప్పట్లో రామారావు పోటీ చేయడం పెద్ద సెన్సేషన్ అయింది. ఆయన స్వయంగా అక్కడ ప్రచారం చేసి వెళ్లారు కూడా. 

 

 

 

అన్న గారి తరువత మళ్ళీ ఇన్నళ్ళకు పవర్ స్టార్ పవన్ ఉత్తరాంధ్రపై ద్రుష్టి పెట్టారు. ఆయన విశాఖ జిల్లా గాజువాకను ఎంచుకోవడం విశేషం. మొదట పవన్ కూడా శ్రీకాకుళం నుంచి పోటీ చేస్తారని వినిపించినా మళ్ళీ మార్చుకున్నారు. ఇక సినీ ప్రముఖులకు ఎన్నికల్లో గెలవడం క్యాక్ వాకే కానీ అప్పట్లో టెక్కలి నుంచి పోటీ చేసినపుడు అన్న గారికి పూర్తిగా పాజిటివ్ వేవ్ ఉంది. పైగా అయిదేళ్ల కాంగ్రెస్ పాలన  పట్ల పెద్ద ఎత్తున విరక్తి కూడా ఉంది. దాంతో బంపర్ మెజారిటీతో ఆయన గెలిచారు. పవన్ విషయానికి వస్తే ఆయన ఇపుడు రెండు బలమైన రాజకీయ పార్టీలతో పోటీ పడుతున్నారు. పైగా కొత్తగా పార్టీ ఏర్పడింది. సరైన నిర్మాణం లేదు. దీంతో పవన్ గెలుపుపై  సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది.

 

 

ఇదిలా ఉండగా పవన్ విజయావకాశాలపై చర్చ సాగుతోంది. పవన్ ఇక్కడ నాన్ లోకల్ అన్న ముద్ర పడడంతో ఆరు నెలల అద్దె కట్టి మరీ గాజువాకలో  ఇల్లు తీసుకున్నారు. దీని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. కేవలం ఆరు నెలల పాటే ఆయన ఇక్కడ ఉంటారా అన్న డౌట్లు ప్రత్యర్ధులు వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా పవన్ సైతం భీమవరం నుంచి పోటీ చేయడం వల్ల కూడా ఆయన పోటీపై సీరియస్ నెస్ కొంత తగ్గినట్లుగా కనిపిస్తోంది. మొదట వచ్చిన జనాల కంటే కూడా తరువాత జనాలు తగ్గడం, పవన్ సభలు చప్పగా సాగడం, స్థానిక సమస్యలపై పవన్ కి అవహాగాన లేకపోవడం వంటివి మైనస్ పాయింట్లుగా ఉన్నాయి.

ఏది ఏమైనా పవన్ ఓ సెలిబ్రిటీ, పైగా బలమైన అసామాజిక వర్గం, యువత అండదండలు ఉన్నాయి. దాని వల్లనే ఆయన గెలుస్తారని లెక్కలు కడుతున్నారు. పవన్ విషయంలో సంప్రదాయ గణాంకాలు సమీకరణలు పనిచేయవని జనసేన నాయకులు అంటున్నరు. పవన్ గెలిస్తే మాత్రం రెండవ సినీ సెలిబ్రిటిని  ఉత్తరాంధ్ర నుంచి అసెంబ్లీకి పంపించినట్లవుతుంది. 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: