ప్రజల కోరకు, ప్రజల చేత, ప్రజల యొక్క మంచిని కోరుకునేదే ప్రజాస్వౌమ్యం.   ప్రజాస్వౌమ్యంలో..ప్రతి పౌరుడికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ఉంటుంది.  పౌరుల ప్రతి ప్రశ్నకు - ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకులకు ఉంటుంది. 


శివాజీ అనే వ్యక్తి గత కొంత కాలంగా చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలు, విధానం అస్సలు మనమందంరం ఆయన గారి దయా-దాక్షిణ్యాల మీద ఆధారపడి, ఆయన గారి మోచేతి నీరు తాగుతూ బ్రతుకుతున్నట్లుందంటున్నారు ఆంధ్రప్రజ


శివాజీ వచ్చి చెబుతాడు ‘ఆపరేషన్ గరుడ’ అని, మరి పోలీసులు, నిఘా వ్యవస్థ, కమెండోలు, NSA, ఆడిటింగ్ ఏజెన్సీలు..పారా మిలటరీ సిబ్బంది, NCC, ఇంకా.. ఇంకా వేల - లక్షల శాంతి - భద్రతలను కాపాడతామని మన వేల-లక్షల కష్టార్జితాన్ని జీతంగా తీసుకుంటున్న వాళ్లు అందరూ దేనికి దండగ?  ఒక్క శివాజీకే ఆ డబ్బు ఏదో ఇచ్చేస్తే ఆయన చూసుకుంటాడుగా.. ఇన్ని వేల-లక్షల మందికి తెలియని విషయాలు శివాజీకి ఒక్కడికే తెలియడమేంటీ..అతను చెప్పిన తర్వాత ఆ మాటల్లో నిజా-నిజాలు వెలికి  తీయకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ మాటలను పట్టుకొని వ్రేలాడటమేంటి  మా ప్రభుత్వ చేతకాని తనం కాకపోతే అంటూ మధన పడుతున్నారు ఆంధ్రప్రజ.


మా ఖర్మ కాలినపుడు ఏ టివి9 లోనో, ABN లోనో దర్శనమిస్తాడు.  మా మొఖాన ఇంత జ్ఞానాన్ని కొడతాడు, వాడిని తిడతాడు, వీడికి వార్నింగ్ ఇస్తాడు, నన్నెవడూ ఏమీ పీకలేడంటాడు..అస్సలు ఆరుకోట్ల ఆంధ్రులంటే ఈ శివాజీ ఏమనుకుంటున్నాడు.? ఒక ప్రకాశం పంతులు, ఒక కొండపల్లి సీతారామయ్య, ఒక రంగా, ఒక పుచ్చలపల్లి సుందరయ్య...రాసుకుంటూ పోతే టావులు-టావులు పేపర్లు చాలవు ఆంధ్రప్రజా నేతల గురించి. 

అలాంటిది ఎవడో వచ్చి మీడియాను అడ్డం పెట్టుకొని ఎవడికో దొంగచాటుగా మేలు చేయడానికి మమ్మలనందరినీ ఏమి తెలియని అడ్డగాడిదల్లా భావిస్తూ..ఈయన గారు చెబితేనే మేమంతా తెలుసుకోగలమన్నట్లు చెబుతూ ఉంటే మా దరిద్రాన్ని తలచుకొని కుమలాలో..ఇల్లు కాలుతుంటే చుట్టకు నిప్పడిగినోడ్ని చూసినట్లు చూసి కడుపు మండాలో తెలియని స్థితి... అయినా మా పిచ్చి గానీ ఇన్ని లక్షల సిబ్బంది ఉన్నా మా ప్రభుత్వమే శివాజీ గారి మాటల మీద ఆయన ఇచ్చే జ్ఞానం మీద ఆధార పడుతుంటే ఇక మా దౌర్భ్యాగ్య స్థితిని ఎవరు మాత్రం తప్పించగలరు అని ఆందోళన చెందుతున్నారు ఆంధ్రప్రజ.


శివాజీ చెబితేనే నిజమని, ఫలానా మీడియాలో వచ్చిందే నిజం అని మేము నమ్మే రోజులు నందమూరి తారక రామారావు గారిని వైస్రాయ్ లో చెప్పులతో కొట్టించిన రోజునే పోయాయి.  అయితే మా భాదంతా ఆరు కోట్ల మమ్మల్ని ఇంత బుద్ద మాంన్యులుగా భావిస్తున్నారు ఈ నాయకులు, శివాజీ వంటి బాబాలు.   మా దగ్గర ధనం, పవరు లేక పోవొచ్చు ఓటు అనే వజ్రాయుధం ఉంది...ఇంకో నాలుగు రోజుల్లో మేము ఎవరని, ఏమి చేయగలమో..ఆంధ్రులు అంటే ఎవరో..తెలుగోడి పౌరుషము, సత్తా ఏంటో రుచు  చూపిస్తామంటున్నారు ఆంధ్రప్రజ.


లక్షల్లో ఉన్న సిబ్బంది...కోట్లల్లో ఉన్న జీతాలు, యంత్రాంగం, మంత్రాంగం ఉన్న ప్రజా ప్రభుత్వాన్ని అందరూ..అందరూ గౌరవించి తీరవలసిందే..మరి శివాజీలాంటి ఎటువంటి రాజ్యాంగ పదవిలో లేని, ప్రజా జీవితంతో ప్రత్యక్ష ప్రమేయం లేని, ఏనాడు ప్రజా తీర్పు కోరని, ప్రజా క్షేత్రంలో ఏనాడూ జయించని సాఫ్ - సీదా వ్యక్తి ఇంత యంత్రాంగం, మంత్రాంగం ఉన్న ప్రభుత్వ తరుపున అప్రకటిత రాయబారిలా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం చూస్తు ఊరుకోవడమేనా అనే సగటు తెలుగు వాని ఘోస..ఫలితం ఎలా ఉండబోతుందో చూడలి.



మరింత సమాచారం తెలుసుకోండి: