40 ఏళ్ళ ఇండస్ట్రీ అనుభవం చంద్రబాబునాయుడుకు ఎందుకు పనికొస్తోందంటే కాపీ కొట్టటానికి అన్నట్లుగా తయారైంది. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి పథకాలు కాపి, హామీలను కూడా కాపీ కొట్టారు. చివరకు తాజాగా విడుదల చేసిన మ్యానిఫెస్టోను కూడా కాపీ కొట్టారు. ఉదయం మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ముందుగానే వైసిపి ప్రకటించింది. దానికి పోటీగా అన్నట్లు ఉగాది పండుగ రోజే తామ మ్యానిఫోస్టో కూడా విడుదలవుతోందని టిడిపి లీకులు ఇప్పించుకున్నారు.

 

సరే ఉదయం 10.30 గంటలకు జగన్ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. మరి టిడిపి మ్యానిఫెస్టోను చంద్రబాబు కూడా విడుదల చేయలికదా, చేయలేదు. యనమల కమిటీ మ్యానిఫెస్టోను రెడీచేసి 10 రోజుల క్రితమే ఇచ్చినా ఎందుకు విడుదల చేయలేదు ? ఎందుకంటే, వైసిపి మ్యానిఫెస్టోను చూసిన తర్వాత చేద్దామని చంద్రబాబు ఆపేశారు. అనుకున్నట్లుగానే జగన్ విడుద చేసిన మ్యానిఫెస్టోను చూసి తర్వాత తమ మ్యానిఫెస్టోలో మార్పులు చేర్పులు చేసి తీరిగ్గా మధ్యాహ్నం పైన ఎప్పుడో రెడీ చేశారు. చివరకు సాయంత్రానికి కూడా మార్పులు చేస్తునే ఉన్నారట.

 

రైతులందరికీ వడ్డీలేని పంటరుణాలను ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ముందు టిడిపి మ్యానిఫెస్టోలో లేకపోయినా చివరి నిముషంలో చేర్చారు. పేద యువతల వివాహానికి లక్ష రూపాయలు ఇస్తానని జగన్ చెప్పారు. అదే విషయాన్ని చంద్రన్న పెళ్ళికానుకను లక్షకు పెంచిది టిడిపి. టిడిపి మ్యానిఫెస్టోలో మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఊసే లేదట. వైసిపి మ్యానిఫెస్టోలో చూసిన తర్వాతే చేర్చారట.

 

చేపలవేట నిషేధ సమయంలో జాలర్లకు నెలకు రూ 4 వేల పరిహారాన్ని రూ 10 వేలకు పెంచటం,  ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల, పరిశ్రమల్లో ఉద్యోగాల నియామకాల్లో 80 శాతం లోకల్ రిజర్వేషన్,  పక్కా ఇళ్ళ నిర్మాణం కోసం లబ్దిదారులు తీసుకున్న బ్యాంకు రుణాల మాఫీ, పౌరులందరినీ యూనివర్సల్ హెల్త్ కేర్ వర్తింపచేయటం, ఎన్టీయార్ వైద్యసేవ క్రింద వైద్యానికయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించటం లాంటి అనేక అంశాలు ముందుగా టిడిపి మ్యానిఫెస్టోలో లేవట. వైసిపి మ్యానిఫెస్టోలో చూసిన తర్వాతే కాపీ కొట్టారట.

 

చూశారా 40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఎంత దుర్గతి పట్టిందో ? 37 సంవత్సరాల వయస్సున్న పార్టీ అంటారు.  దేశంలోనే తనంతటి సీనియర్ రాజకీయ నేత లేడంటారు. ప్రపంచంలోని అతికొద్ది మంది పాపులర్ నేతల్లో తాను కూడా ఒకడిననని చెప్పుకుంటుంటారు. కానీ 69 ఏళ్ళ వయస్సును చంద్రబాబు చివరకు 46 ఏళ్ళ వయస్సున్న జగన్ మ్యానిఫెస్టోను కాపీ కొట్టటం విచిత్రం కాక మరేమిటి ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: