బయోపిక్కులు కూడా ఈసారి ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. తెలుగుదేశం కోసం బాలయ్య తీసిన కధానాయకుడు, మహానాయకుడు మూవీస్ బాక్సాఫీస్ వద్ద చీదేశాయి. ఇక వర్మ తీసిన లక్షీస్ ఎంటీయార్ మొవీ ఏపీలో విడుదల కాలేదు. ఈ టైంలో వైఎస్సార్ మీద తీసిన బయోపిక్ యాత్ర ఫిబ్రవరిలో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది.


ఇక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర ఆధారంగా వచ్చిన  'యాత్ర' సినిమా టీవీ ప్రీమియర్ షోను ఆపించాలని ట్రై చేసిన తెలుగుదేశం పార్టీకి ఈసీ రెడ్ సిగ్నల్ వేసింది. ఏఎ మూవీ ఇపుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీవీలో  'యాత్ర' సినిమా ప్రసారమవుతోదంది. దీన్ని ఆపాలని తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ ను కోరింది. తెలుగుదేశం ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్ అందుకు నో చెప్పింది. టీవీలో ఆ సినిమా ప్రసారాన్ని ఆపడం తమ పని కాదంటూ ఈసీ తేల్చి చెప్పింది.


ఒకవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను ఆపిన తెలుగుదేశం పార్టీకి  'యాత్ర'  ప్రసారాన్ని ఆపడం మాత్రం సాధ్యం కాలేదు. మరి వైఎస్సార్ పాలన మళ్ళీ తెస్తానంటూ జగన్ ఓ వైపు చెబుతున్న వేళ, అదే వైఎస్సార్ కధతో తీసిన యాత్ర మూవీ ఎంతమేరకు ప్రభవం చూపుతుందన్నది చూడాలి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇక్కడ పోలింగ్ కూడా దగ్గర పడిన నేపధ్యం ఉంది. అన్నీ చూసుకుంటే మాత్రం యాత్ర మంచి వ్యూయర్ షిప్ ని సొంతం చేసుకునేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: