వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ తన పాదయాత్రలో భాగంగా ప్రజల నుండి వచ్చిన సమస్యల విషయంలో 2019 ఎన్నికల మేనిఫెస్టోలో అద్భుతమైన హామీలు ఇచ్చారని అంటున్నారు రాష్ట్ర ప్రజానీకం. గతంలో ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న జగన్ కి ఆ సమయంలో బ్రాహ్మణులు చాలా బాధలు చెప్పుకున్నారు.


ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు హయాంలో బ్రాహ్మణులకు కనీస గౌరవం సమాజంలో దక్కడం లేదని చిన్నచూపు చూస్తున్నారని అగ్రకులం అయినా కానీ అనేక బాధలు సమాజంలో ఎదుర్కొనవలసి వస్తుందని జగన్ కి తెలియజేశారు బ్రాహ్మణులు. ఈ నేపథ్యంలో సమాజంలో అగ్ర పొలంలో ఉన్న వెనుకబడి ఉన్న కుటుంబాలకు జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో అద్భుతమైన వరాల హామీలు ఇచ్చారు ..అన్ని అగ్ర కులాల (క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ తదితర) వారికి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు.


ఈ కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి ఆయా కులాలకు చెందిన పేదలకు అండగా ఉంటాం అని భరోసా మేనిఫెస్టోలో ఇవ్వడంతో రాష్ట్రంలో ఉన్న అగ్రకులాల సామాజిక ప్రజలు జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోపై ఎంతో సంతృప్తికరంగా ఉందని...జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడని కచ్చితంగా రాబోతున్న ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రి అవడం తథ్యం అని అంటున్నారు అగ్రకులానికి చెందిన ప్రజలు.


మరింత సమాచారం తెలుసుకోండి: