విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు సబ్బం హరిని పొలిటికల్ లక్కీ స్టార్ అని చెప్పుకుంటారు. ఆయన రాజకీయం మొత్తం స్టార్ ని బట్టే నడిచింది. రెండు సార్లు అధికార పదవులు అనుభవించినా అది కూడా లక్కును తొక్కి సాధించినవే. ఇపుడు దాదాపుగా డెబ్బయి ఏళ్ళ పడిలోకి చేరుకుంటున్న హరికి చివరి అవకాశంగా భీమునిపట్నం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం లభించింది.

 


మరి హరి ఈ అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటా రన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే ఆయనకు ప్రత్యర్ధిగా  ఉన్న వైసీపీ అభ్యర్ధి అవంతి శ్రీనివాసరావు గట్టి వారు. ఆయన మొత్తం భీమిలీ అంతా మారుమోగిస్తున్నారు. ఆయన ఇప్పటికే అక్కడ గెలుపు నాదే అంటున్నారు. మెజారిటీ యాభై వేలకు తగ్గదని కూడా గట్టిగా చెప్పేస్తున్నారు. ఒకసారి అక్కడ ఎమ్మెల్యేగా చేసిన అవంతి శ్రీనివాసరావు గెలుపు లాంచనమేనని తేలిపోతోందంటున్నారు వైసీపీ నాయకులు.

 


ఇక సబ్బం హరి చివరి నిముషంలో నామినేషన్ వేసిన తరువాత ఆలస్యంగా ప్రచారంలోకి దిగారు. ఆయన ఇంకా మొత్తం నియోజకవర్గం తిరగలేదు. పైగా దిగుమతి సరుకు అని తమ్ముళ్ళు గుర్రుమంటున్నారు. ఆయనకు తప్పని సరి పరిస్థితుల్లో మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇక  హరి విషయానికి వస్తే పూర్తిగా ఆయన లక్కునే మళ్ళీ నమ్ముకున్నారు. మేయర్ గా తాను అనూహ్యంగా ఎలా గెలిచానో, ఎంపీగా అనకాపల్లి నుంచి బిగ్ ఫిగర్లను ఓడించి 2009 ఎన్నికల్లో ఎలా గెలిచానో మళ్ళీ అలాగే గెలుస్తానని ధీమాగా ఉన్నారు. ఇక రాజకీయ చరమాంకంలో ఉన్న హరి ఒకవేళ ఓడితే ఆయన రాజకీయ జీవితం పూర్తిగా క్లోజ్ అయినట్లేనని అంటున్నారు చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: