మంత్రి గంటా శ్రీనివాసరావు రికార్డు స్రుష్టిస్తున్న నేత. ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఎన్నికకూ ఓ కొత్త సీటులో పోటీ చేస్తూ గెలుస్తున్నారు. ఈసారి విశాఖ ఉత్తరం అసెంబ్లీ నుంచి ఆయన పోటీలో  ఉన్నారు. ఇప్పటివరకూ పోటీ చేసినవి అన్నీ రూరల్ బేస్ ఎక్కువగా  ఉన్న అసెంబ్లీ సీట్లు. ఈసారి మాత్రం ఏకంగా అర్బన్ ఏరియా మధ్యలోకి వచ్చేశారు.

 

మరి గంటాకు ఇక్కడ విజయావకాశాలు ఎలా ఉంటాయన్నది ఆలోచన చేసుకుంటే మాత్రం మంత్రి గారి చాణక్యమే గెలిపించాలి అంటున్నారు. అర్బన్ ఓటర్లు హామీలకు పడరు, తాయిలాలకు లొంగరు, ప్రధానంగా మధ్యతరగతి వర్గాలు ఉన్నాయి. వారు నీతి నిజాయతి అని పట్టింపులు ఎక్కువగా చూస్తారు. ఇక లోకల్, నాన్ లోకల్ గొడవ ఎటూ ఉంది. కులాల సమీకరణలు ఇక్కడ మంత్రికి మైనస్ గా ఉన్నాయని అంటున్నారు. అన్ని కులాల సమాహరంగా ఉన్న విశాఖ ఉత్తరంలో గంట మోగడం కష్టమేనని అంటున్నారు.

 

గంటా గెలిచేందుకు కుల సంఘాల నాయకులను వెంట తిప్పుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి నాయకులను ఫిరాయింపు జరిగేలా చూస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ని చేరదీశారు. ఇపుడు మరో ప్రముఖున్ని కూడా వైసీపీ నుంచి తెస్తారని ప్రచారం సాగుతోంది. గంటా ఇలా నాయకులను ఆకట్టు కున్నంత మాత్రన జనాలు వోట్లు వేస్తారా అన్న డౌట్లు ఉన్నాయి.

 

ఇక్క ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఉత్తర భారతం నుంచి వ్యా పారం  నిమిత్తం వచ్చిన వారంతా బీజేపీ వైపు చూస్తున్నారు. అణగారిన వర్గాలు వైసీపీ అంటున్నారు. ఇక్కడ టీడీపీ గెలిచి రెండు దశాభ్దాలు  గడచిన వేళ గంటా గెలుపు కోసం  చమటోడ్చాల్సిందేనని అంటున్నారు. చూడాలి మరి.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: