అనంతపూర్ జిల్లా లో అందరిని ఆకర్షిస్తున్న నియోజక వర్గాల్లో రాప్తాడు ఒకటీ. ఇక్కడి తాజా రాజకీయ పరిస్థితులు ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ పూర్తి ఆధిపత్యం పరిటాల కుటుంబం దే అనిపిస్తుంది. 

అభ్యర్థులు : టీడీపీ పార్టీ నుంచి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాంను బరిలో దింపుతున్నారు. వైసీపీ నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీకి సిద్దం అవుతుండగా అటు జనసేన నుంచి పవన్ కుమార్ నిలబడుతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఎర్రి స్వామి, బీజేపీ నుంచి జనార్ధన్ రెడ్డి రేస్ లో ఉన్నారు.రాప్తాడు

చరిత్ర : 2009 లో తొలిసారి ఎన్నికలు జరగ్గ టీడీపీ నుంచి బరి లో దిగిన పరిటాల సునీత కాంగ్రెస్ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కేవలం 1700 ఓట్ల తో గెలుపొందారు.ఇక 2014 లో ప్రకాష్ రెడీ వైసీపీ అభ్యర్థి గ పోటీ చేయగ టీడీపీ నుంచి మళ్లీ సునీత తన ఆధిక్యత ను పెంచుకొని దాదాపు 8 వేల ఓట్ల తో గెలుపొందారు.దీంతో మరో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని సునీత,ఎలాగైనా విజయం సాధించి అసెంబ్లీ అడుగు పెట్టాలని ప్రకాష్ రెడ్డి భావించడం తో ఇక్కడ రాజకీయం ఆసక్తికరం గా మారింది. 

పరిటాల ఆధిపత్యం : 2009 నుంచి వరుసగా రెండసార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన సునీత ప్రజలకు ఎప్పుడు దగ్గర గానే ఉంటారు అయితే మంత్రి గా ఎన్నికైన తర్వాత దూరమాయారని వాదన కూడా లేకపోలేదు. ఇక వరుస గా రెండు సార్లు ఓడిన ప్రకాష్ రెడ్డి కి నియోజకవర్గం లో పట్టు మాత్రం తగ్గలేదు. అయితే చివరి నిమిషంలో అభ్యర్థులు మారిన ఆశ్చర్య పొనక్కర్లేదు. ఎందుకు అంటే పరిటాల సునీత తన తనయుడు అయిన పరిటాల శ్రీరాం ను బరి లో దించే ప్లాన్ లో ఉన్నారు.ఇటు వైపు వైఎస్సీపీ నుంచి ప్రకాష్ రెడ్డి దాదాపు ఖరారు అయిపోయినట్టే.ప్రధాన పోటీ మాత్రం అధికార , విపక్ష లా మధ్యే ఉండే అవకాశం ఉంది.

గెలుపెవరిది ? : టీడీపీ కి మంచి పట్టు ఉన్న ప్రాంతం కావడం అలాగే ఇక్కడ పరిటాల కుటుంబం కి ఉన్న ఆదరణ తోడవడంతో తో గెలుపు దాదాపు గా టీడీపీ చేతిలోనే ఉంది. వైసీపీ నేత ప్రకాశ్ రెడ్డి గాలి కొంతమేర వీస్తున్నపట్టికి, పరిటాల ముందు నిలబడలేక పోవచ్చు. అలాగే మిగతా పార్టీల గురించి చెప్పనక్కర్లేదు, డిపాజిట్లు అయిన దక్కుతాయా అన్న సందేహం వస్తుంది. అలాగే కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ ఉన్న కేవలం తమ ఉనికిని కాపుడుకోవడనికి పోటీలో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: