చంద్రగిరి నియోజకవర్గం అక్కడున్న నేతలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారుతుంది. అదే తరహాలో ప్రచారం జోరుగా సాగుతోంది. అధికరవిపక్షాలు విమర్శ అస్త్రలతో దూసుకోపోతున్నయి. టీడీపీ కి అనుకూలంగా ఉన్న ప్రాంతం ఇప్పుడు ఆ పార్టీకి పట్టు సడిలింది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నేత కావడం మళ్లీ వైసీపీ అధికారం కోసం వెంపర్లాడుతుంది.

అభ్యర్థులు : టీడీపీ పార్టీ నుంచి పులవర్తి నాని పోటిచేయగా వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి రేస్ లో ఉన్నారు. అలాగే జనసేన నుంచి డా.శెట్టి సురేంద్ర , కాంగ్రెస్ నుంచి మధు బాబు బీజేపీ నుంచి పోటీ లో ఎవరు నిల్చోలేదు.

చంద్రబాబు రాజకీయ ప్రస్థానం : చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన ప్రదేశం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకర్గం. రెండోసారి గెలుపు కోసం ఒకరు, అధినాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని విజయం ద్వారా రెట్టింపు చేసుకోవాలని మరొకరు ఇక్కడ పంతం పట్టారు. ప్రభుత్వ పథకాలే ప్రచార అస్త్రాలని అధికార పార్టీ అంటుంటే, సర్కారీ వైఫల్యాలు తమ విజయానికి మెట్లని ప్రతిపక్షం ధీమగా ఉంది. చంద్రబాబు సొంతూరు అయిన నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలో ఉండటంతో ఇక్కడ విజయం అధికారవిపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారింది.

చెవిరెడ్డి పాలన : వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యే గా ఉన్నారు. జెడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయా జీవితం ప్రారంభించి శాసనసభ్యుడు స్థాయి కి ఎదిగిన చెవిరెడ్డి తరుచు వివాదాలతో సావసం చేస్తుంటారు. సొంత నిధులతో చేపట్టిన అభివృధి పనులే తనకు గెలుపును అందిస్తాయి అంటున్నారు. చెవిరెడ్డి దూకుడుకు ఎప్పటీకప్పుడు చెక్ పెడుతూ వస్తున్నా టీడీపీ 2019 లో ఎలాగైనా ఓడించాలని పంతం పట్టింది. పులివర్తి వెంకట మని ప్రసాద్ ను పోటీలోకి దించుతున్నారు. ఆయన టీడీపీ తో తనకు ఉన్న అనుబంధం తన విజయాన్ని రెట్టింపు చేస్తాయని అంటున్నారు. 

టఫ్ ఫైట్ :  అధికారం కోసం నాయకులు గట్టి ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ శాతం ప్రజలలో ఉండేందుకు చూస్తున్నారు. చంద్రగిరిలో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ప్రచారం కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభావం కానరావడం లేదు. ఇక జనసేన అభ్యర్థి హవా కొంత మేర నడుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: