విజయవాడలో ఇపుడు అసలైన పోటీ జరుగుతోంది. ఇక్కడ పార్లమెంట్ ఎన్నిక ఏపీని మారుమోగిస్తోంది. ఇక్కడ టీడీపీ 2014 ఎన్నికల్లో నెగ్గింది. అంతకు ముందు రెండు సార్లు కాంగ్రెస్ వరసగా గెలిచింది. ఇక టీడీపీ ఆవిర్భవించాక కాంగ్రెస్ టీడీపీ ఢీ అంటే ఢీ అంటూ వచ్చా యి.  గత ఎన్నికల నుంచి వైసీపీ బస్తీమే సవాల్ అంటోంది.

 


గత ఎన్నికల్లో కోనేరు ప్రసాద్ ని వైసీపీ బరిలోకి దింపింది. అయితే ఆయన టీడీపీ అభ్యర్ధి కేశినేని నాని ముందు తట్టుకోలేకపోయారు. మరి ఈసారి వెతికి వెతికి మరీ వైసీపీ పీవీపీని ఎంపిక చేసింది. పొట్లూరు వర ప్రసాద్ సినిమా నిర్మాతగా పరిచయం. అంతే కాదు, ఆయన భారీ పారిశ్రామికవేత్త. ఆయన గత ఎన్నికల్లోనే పోటీకి దిగాలనుకున్నారు. జనసేన నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిముషంలో ఆయన తప్పుకున్నారు.

 


ఈసారి ఆయన కోరిక నెరవేరుతోంది. అలాగే వైసెపీ నుంచి గట్టి అభ్యర్ధిగా ఆయన ఉన్నారు. ఇక్కడ కేశినేని నానికి ఓ విధంగా చమటలు పట్టిస్తున్నారు. క్రిష్ణా జిల్లాలో టీడీపీ డామినేషన్ ఎక్కువ. అయితే ఇపుడు వైసీపీ గాలి, అలాగే గట్టి పోటీ నేపధ్యంలో పీవీపీ రికార్డ్ తిరగరాస్తారని అంటున్నారు. ఆయన ఈసారి గెలుస్తారని పెద్ద ఎత్తున బెట్టింగులు కూడా జరుగు తున్నాయంటే  ఇక్కడ ఏ రేంజిలో పోటీ ఉందో అర్ధమవుతుంది.

 


పీవీపీ జగన్ కోటరీ మనిషి. పైగా అర్ధబలం, అంగబలం దండీగా ఉన్న వారు కావడంతో విజయవాడను గడగడలాడిం చేస్తున్నారు.   ఓ విధంగా కేశినేని నానికి ఇది చాలంజిగానే ఉంది. అధికార పార్టీ లోపాలను విడమరచి చెప్పడంతో పాటు వైసీపీ నవరత్నాలను కూడా పీవీపీ ఏకరువు పెడుతున్నారు. జగన్ సైతం విజయవాడ రెండు మార్లు వచ్చి చేసిన ప్రచారం వైసీపీకి మంచి బూస్టింగ్ ఇచ్చింది. వైసీపీ వూపు బాగానే వుంది కాబట్టి పీవీపీ గెలుపు ఖాయమని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇక్కడ కనుక జెండా పాతెస్తే టీడీపీ గుండె కాయను వైసీపీ కొల్లగొట్టేసినట్లేనని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: