ఏపీ ఎన్నికల ఘట్టం చివరి దశకు చేరుకుంది. ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది. ఈ కీలక సమయంలో ఓ షాకింగ్ ఘటన జరగబోతోందా.. ఏపీలో కాపు సామాజిక వర్గ ఉద్యమనేతగా పేరున్న ముద్రగడ పద్మనాభం చివరి నిమిషంలో పవన్ కల్యాణ్‌కుషాక్ ఇవ్వబోతున్నారా.. 


అవునంటున్నాయి..కొ్ని సోషల్ మీడియా కథనాలు.. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చివరి నిమిషంలో వైసీపీలో చేరి.. ఆ పార్టీ తరపున ప్రచారం చేయవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే.. వైసీపీకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం చాలా బలంగా ఉంటుంది. 

అయితే జనసేన పార్టీ ఇప్పటికే ఈ ఓటు బ్యాంకు ఆధారంగానే గెలుపు ఆశలు పెట్టుకుంది. అయితే పవన్‌ కల్యాణ్ లో ఆవేశం తప్ప.. ఆచరణ లేదన్న అభిప్రాయానికి కాపు నేతలు వస్తున్నారట. ఇప్పటికే చంద్రబాబు గత ఎన్నికల్లోనే కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇచ్చి తప్పారు. 

అందుకే ఈసారి జగన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా కాపు రిజర్వేషన్లు సాధించుకునే మార్గంలో ముందడుగు వేయాలని ఆయన
నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. జనసేనకు ఇదిచాలా పెద్ద దెబ్బయ్యే అవకాశం ఉంది. ఇదే నిజమైతే జగన్ సీఎం సులభంగా అవుతాడని విశ్లేషకులు అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: