ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో పరాజయం ఖాయమైన చంద్రబాబును గెలిపించేందుకు ఆంధ్రజ్యోతి పత్రిక అడ్డదారులు తొక్కుతందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇందుకు వారు కొన్ని సాక్ష్యాలు కూడా చూపుతున్నారు. వారు చెబుతున్న విషయం ఏమిటంటే... కొద్ది రోజుల క్రితం లోక్ నీతి అనే సంస్థ చేసిన సర్వే పేరుతో ఆంద్రజ్యోతి ఒక సర్వేను విడుదల చేసింది. 


ఇందులో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని తెలిపింది. అన్ని సర్వేలూ జగన్ గెలుస్తున్నాయని చెబుతుంటే.. ఇదేంటి ఇలా ఉందని అప్పుడే కొందరికి అనుమానం వచ్చింది. తీరా చెక్ చేస్తే.. అసలు అలాంటి సర్వే ఏది తాము ఇవ్వలేని లోక్ నీతి సంస్థ ప్రకటించింది. 


సరిగ్గా పోలింగ్‌కు నాలుగైదు రోజుల ముందు విజయసాయిరెడ్డి ఆడియో టేప్ అంటూ మరోసారి ఆంధ్రజ్యోతి హడావిడి చేసింది. అసలు అది తన ఆడియోనే కాదు.. దీనిపై కేసు పెడతానంటూ విజయసాయిరెడ్డి రంకెలు వేశారు. ఆయన ఆ ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. 

అంతేకాదు.. విజయసాయిరెడ్డి మరోమాట కూడా చెప్పారు. తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని లగడపాటితో చెప్పించాలా? ఇంకో రూపంలో వెల్లడించాలా? అని మల్లగుల్లాలు పడుతున్నారట చంద్రబాబు. లగడపాటి+ ఏదైనా చానల్ చేసిన సర్వే అని చెప్పిస్తే జనాలను నమ్మించవచ్చని పచ్చమీడియా సలహా ఇచ్చిందిట. స్కెచ్ ఎలా ఉంటుందో చూడాలి అంటూ విజయసాయి ట్వీట్‌ చేశారు. 

విజయసాయిరెడ్డి చెప్పినట్టుగానే ఆంధ్రజ్యోతి చేయడం విశేషం. ఆయనట్వీట్ చేసిన  4 గంటల అనంతరం ఆంధ్రజ్యోతి కార్పొరేట్ చాణక్య పేరుతో సర్వే విశేషాలు వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం టిడిపికి101 సీట్లు వస్తాయని ప్రచారం చేశారు. అయితే నిజానికి ఇలాంటి పేరుతో అసలు సంస్థ లేదంటున్నారు వైసీపీ నేతలు.  మొత్తానికి విజయసాయిరెడ్డి చెప్పినట్టేై ఆంధ్రజ్యోతి చేసిందన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: