ఏపీ ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలి.. ఇదీ ఇప్పుడు ఏపీ ఓటరు ముందున్న ప్రశ్న.. జనం సంగతి ఎలా ఉన్నా.. మళ్లీ చంద్రబాబును గెలిపించకపోతే.. రాష్ట్రం కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటుందని ఎల్లో మీడియా ఉదరగొడుతోంది. రోజుకో కొత్త తరహా ప్రచారాన్ని తెరపైకి తెస్తోంది. 


కానీ అసలు విషయాన్ని విశ్లేషిస్తే.. చంద్రబాబు వస్తే రాష్ట్రానికి కష్టాలే వస్తాయి.. ఎందుకంటే.. ఇక్కడ చంద్రబాబు అధికారంలోకి వచ్చి.. కేంద్రంలో యూపీఏ సర్కారు వచ్చిందంటే.. ప్రత్యేక హోదా తప్ప వేరే సౌకర్యాలు రావు. ఆ హోదా విలువ కూడా చాలా ౩౦ వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. 

ఇక పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వచ్చి.. కేంద్రంలో మళ్లీ మోడీ వచ్చాడటంటే.. ఏపీకి చుక్కలు చూపించడం ఖాయం..ఎందుకంటే మోడీని చంద్రబాబు  అండ్‌ కో తిట్టినంత దారుణంగా ఎవరూ తిట్టి ఉండరు. గతంలో మోడీ ఇచ్చిన వాటిని కూడా తమ ఖాతాలో వేసుకున్న చరిత్ర ఇక్కడి తెలుగుదేశం సర్కారుది.. 

అందుకే మోడీ సర్కారు ఏపీకి ఎలాంటి సాయం అందించే పరిస్థితి ఉండదు. మరి ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలు తీర్చాలంటే కనీసం ఏటా నాలుగు లక్షల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. సో.. ఎలా చూసినా మళ్లీ చంద్రబాబు వస్తే ఏపీకి కష్టాలు తప్పే అవకాశం కనిపించడం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: