చంద్రబాబుది ఒక విచిత్ర మనస్తత్వం. తన శత్రువులైన వారందరిని ఒకే గాటన కట్టగలరు. అలాగే తానైతే ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చు. అదే ఇతరుల పొత్తును అపవిత్ర పొత్తు అని ప్రచారం చేస్తారు. దానికి తన కుల మీడియా మద్దతు సహస్ర గొంతుకలతో గాలికంటే వెగంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలరు. ఇదే ఆయన ప్రత్యేకత. అయితే ఇది ఆయన గొప్పతనం మాత్రం కాదు. కులం కోసం,  పార్టీ కోసం, చంద్రబాబు కోసం తనను తాను దహించుకుంటూ, చంద్రబాబుకు వెన్నెల కాంతులను పంచగల మీడియా త్యాగశీలత ప్రధాన కారణం.  దానికి ప్రతిగా ప్రకటనల పెరుతో లభించే వందల కోట్ల ప్రజాధనమే ప్రతిపలంగా లభిస్తుంది. మీడియా త్యాగానికి చంద్రబాబు సైతం వందల రెట్లు ముట్టజెబుతూనే ఉన్నారు.  


ఎన్నికల ప్రచారంలో ఏపి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎక్కువగా ముగ్గురిని టార్గెట్ చేస్తున్నారు. ఆ ముగ్గురు 1.తన ప్రధాన ప్రత్యర్థి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి 2. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 3. ప్రధానమంత్రి నరేంద్రమోదీ.  ఎన్నికల తొలిదశలో జగన్మోహనరెడ్డి, నరేంద్ర మోదీ ని ఎక్కువగా విమర్శించిన చంద్రబాబు, ఏపీ ఎన్నికల ఎన్నికల మలిదశ ప్రచారంలో కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారనే వాదనను ఎక్కువగా ప్రచారంలోకి తీసుకెళ్లేందు కు నెల రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు చేసే ఈ తరహా విమర్శలపై, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం స్పందించడం లేదు.

modi jagan kcr కోసం చిత్ర ఫలితం

సాధారణంగా చంద్రబాబు విమర్శలకు, తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం కేసీఆర్‌కు బాగా అలవాటు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు కేసీఆర్. కేసీఆర్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. అయితే ఆ ఎన్నికల్లో చంద్రబాబు కారణంగానే కేసీఆర్ రాజకీయం గా లాభపడ్డారని, టీఆర్ఎస్‌కు కొంతమేర ఓట్ల శాతం కూడా పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ తనపై అమలు చేసిన వ్యూహాన్నే ఏపీలో అమలు చేయాలని భావించిన చంద్రబాబు, ఇక్కడ ఎక్కువగా కేసీఆర్‌ ను టార్గెట్ చేస్తున్నారు.

modi jagan kcr కోసం చిత్ర ఫలితం

అయితే తెలంగాణ ఎన్నికల పలితాలు వచ్చిన వెంటనే చంద్రబాబుకు రిటన్ గిఫ్ట్ ఇస్తానని, ఏపీలో ఆయనను ఓడిస్తామని అన్న కేసీఆర్, ఈ విషయంలో తన సహజశైలికి భిన్నంగా మౌనాన్ని ఆశ్రయించారు. దాంతో చంద్రబాబు వ్యాఖ్యలకు విలువలేకపోగా, జనంలో పలుచనౌతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునే ఎక్కువగా టార్గెట్ చేసిన గులాబీ నేత . లోక్ సభ ఎన్నికల్లో మాత్రం అసలు చంద్రబాబు ను నామమాత్రంగానైనా గుర్తించకపోవటం, స్పందించకపోవటం విశ్లేషకుల్లో అశక్తి రేపుతుంది ఈ విషమైన విభిన్నత అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే కేసీఆర్ తీరు తెలిసిన వారు మాత్రం మౌనం వ్యూహాత్మకం అని చర్చించుకుంటున్నారు.

silence of kcr is a strategy for chandrababu comments కోసం చిత్ర ఫలితం

చంద్రబాబు విమర్శలకు తాను స్పందిస్తే, ఏపీ ఎన్నికల్లో అది ఆయనకు సరికొత్త ఆయుధం అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. అలా జరిగితే,  అంతిమంగా చంద్రబాబు లాభపడి వైసీపీ నష్టపోతుందనే ఆలోచనలో ఉన్నట్లున్నారు కేసీఆర్. ఎన్నికలు పూర్తయిన తరువాత ఈ విషయంలో కేసీఆర్ పూర్తిస్థాయిలో చంద్రబాబును  తన రిటార్ట్ సెటైర్లతో ఎన్-కౌంటర్ చెసేస్తారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఏపీ ఎన్నికల విషయంలో కేసీఆర్ మౌనం వెనుక అసలు కారణం ఏమిటో? తెలియాలంటే మరి కొద్ది రోజుల ఆగాల్సిందే నిరీక్షించాల్సిందే.

modi jagan kcr కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: