ఏపీలో రాజకీయ ముఖ చిత్రం ఇపుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. మరో మూడు రోజుల్లో పోలింగుకు వెళ్తున్న వేళ జనం ఏ వైపు ఉన్నారన్నది ఇంకాస్తా తేటతెల్లమవుతోంది. ఏపీలో మార్పు అన్నది కచ్చితమని జనం నాడి పక్కాగా చెబుతోంది. ఇపుడున్న పరిస్థితిని మార్చడం కూడా కష్టమని కూడా తెలుస్తున్న వేళ ఏపీలో అధికార మార్పిడికి రంగం సిద్ధమైపోయిందని భావించవచ్చు.

 


 

ఏపీలో నువ్వా నేనా అని ఢీ కొంటున్న రెండు ప్రధాన పార్టీలో మొగ్గు కాస్తా వైసీపీ వైపే కనిపిస్తోంది. ఏపీలో కీలకమైన జిల్లాలుగా పేరున్న గోదావరి ఉత్తరాంద్ర్హలో ఈసారి జనం తమ అభిమతం మార్చుకుంటున్నారు. గత ఎన్నికల్లో అనుభవం పేరు మీద టీడీపీకి ఓటు వేసిన జనం ఈసారి ఒక్క చాన్స్ అంటున్న వైసీపీ వైపుగా  మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో గోదావరి జిల్లాలతో పాటు, ఉత్తరాంధ్రలోని జిల్లాలు అధికార పార్టీ నుంచి చేజారనున్నాయని తెలుస్తోంది.

 


మొత్తం ఇక్కడ 68 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మెజారిటీ సీట్లు ఇందులో   వైసీపీకి లభించే అవకాశాలు ఉన్నట్లుగా సర్వేల బట్టి అర్ధమవుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో టీడీపీ కంటే ఒక్క సీటు ఎక్కువగానే వైసెపీ గెలుచుకునే అవకాశాలు ఉంటే, విశాఖ జిల్లాలో పోరు నువ్వా నే నా అన్న తీరులో సాగుతోంది. ఇక్కడ రూరల్ జిల్లా వైసీపీ గాలు లు వీస్తూంటే అర్బన్ జిల్లాలో టీడీపీకి పట్టు కనిపిస్తోంది.

 


గోదావరి జిల్లాల్లో త్రిముఖ పోరు ఉంది. ఇందులో జనసేన ప్రధానంగా టీడీపీ ఓట్లకే షాక్ తెప్పిస్తుందని భావిస్తున్నారు. దాంతో వైసీపీకి ఇక్కడ గరిష్టంగా సీట్లు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. క్రిష్ణా, గుంటూరు జిల్లా ల్లో  టీడీపీ, వైసీపీల మధ్య ఢీ అంటే ఢీ అన్న పరిస్థితి ఉంది. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు, రాయలసీమ జిల్లాల్లో వైసీపీ తన పట్టుకుని మరో మారు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఇపుడున్న అంచనాల ప్రకారం వైసీపీ మంచి ఆది క్యత సాధిస్తుందని సర్వేల బట్టి చూసినా తెలుస్తోంది.



ఇదిలా ఉండగా ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సంస్థతో కలిపి నిర్వహించిన ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో జగన్ ఆధ్వర్యంలోని వైసీపీకి 100 సీట్లు వస్తాయట. తెలుగుదేశం పార్టీకి 45 సీట్లు కాంగ్రెస్ పార్టీకి నాలుగు సీట్లు బీజేపీకి మూడు సీట్లు ఇతరులకు 23 సీట్లు వస్తాయని ఇండియా టీవీ ఎక్స్ సర్వే లో తేలింది. ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే... వైసీపీకి 18 - టీడీపీకి ఏడు ఎంపీ సీట్లు వస్తాయని ప్రకటించింది.




మరింత సమాచారం తెలుసుకోండి: