విజయనగరం రాజ వంశీకులకు కొత్త వారసురాలు వచ్చారు. ఆమె ఈసారి విజయనగరం అసెంబ్లీ బరిలో ఉన్నారు. గెలిస్తే ఆమె రాజకీయానికి ఎదురు ఉండదు. మరి కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంది. మరి యువరాణికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయా అన్నది ఇక్కడ చూడాలి. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటున్న డైనమిక్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు జాతకం ఏంటన్నది జనాలు డిసైడ్ చేయనున్నారు.

 


ఆమె మీద పోటీ చేస్తున్నది అశోక్ గజపతి రాజుకు తొలిసారి ఓటమి చవి చూపించిన వైసీపీ అభ్యర్ధి కోలగట్ల వీరభద్రస్వామి. ఆయన 2004 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరీ అశోక్ ని ఓడించేశారు. ఆ ఎన్నికల్లో షాక్ తినిపించారు.  ఇపుడు మళ్ళీ ఆయన కుమార్తె అదితి గజపతి పోటీలో ఉన్నారు. తనయను కూడా ఓడిస్తే రికార్డ్ ఆయనకే సొంతం అవుతుంది. ఇక్కడ టీడీపీలో వర్గ పోరు ఉంది. చంద్రబాబు సర్దిచెపడం వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత ప్రచారంలో పాలుపంచుకుంటున్నా మనస్పూర్తిగా సహకరిస్తారా అన్నది సందేహం. ఎందుకంటే ఒకమారు అదితి గజపతి గెలిస్తే ఇక ఆమె పర్మనెంట్ గా టీడీపీ అభ్యర్ధి అవుతారు. దాంతో ఆ పార్టీలో బీసీలు గుర్రుమీదున్నారు.

 


ఇక వైసీపీకి కూడా వర్గ పోరు ఉంది. ఇక్కడ నుంచి పోటీలో ఉన్న కోలగట్ల వీరభద్రస్వామికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు పడదు, దాంతో బొత్స వర్గం కోలగట్ల గెలుపునకు పనిచేయడంలేదు. కోలగట్ల కూడా సొంతంగానే తన రాజకీయం తాను చేసుకుంటున్నారు. ఇక ఇక్కడ ఈ వర్గాన్ని టీడీపీ ఆకట్టుకుంటోంది. అదే విధంగా టీడీపీ లోని అసమ్మతి నేతలకు కోలగట్ల గేలం వేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ ఢీ అంటే ఢీ అన్న పరిస్థితి ఉంది. చూడాలి ఈ హాట్ సీటు ఎవరి పరం అవుతుందో.

 


మరింత సమాచారం తెలుసుకోండి: