గాజువాక ఇపుడు ఏపీలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయన తన నివాసాన్ని కూడా ఇక్కడే ఉంచుకుంటానని చెప్పుకొస్తున్నారు. తాను లోకలేనని, అందరికీ అందుబాటులో ఉంటానని కూడా మాట ఇస్తు న్నారు. ఇక్కడ ఉన్న రెండున్నర లక్షల జనాభాలో మెజారిటీ ఓట్లు కొల్లగొట్టడానికి జనసేన రెడీ అవుతోంది.

 


ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్ధిగా ముచ్చటగా మూడవసారి పోటీ చేస్తున్న తిప్పల నాగిరెడ్డి సానుభూతి ఓట్ల మీద ఆశలు పెట్టుకున్నారు. ఈసారి తన విజయం ఖాయమని ఆయన ధీమగా ఉన్నారు. పవన్ పోటీ వల్ల టీడీపీ ఓటు బ్యాంక్ కే గండి పడుతుందని ఆయన అంటున్నారు. పైగా ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కూడా నాగిరెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇక నిన్న వైసీపీ అధినేత జగన్ గాజువాకలో చేసిన ప్రచారానికి పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. దాంతో వైసీపీలో ధీమా కనిపిస్తోంది.

 


టీడీపీ విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ బలమైన నాయకుడే కానీ ఆయనకు పార్టీలో వర్గ పోరు ఉంది. పైగా టీడీపీలో ఆయన్ని ఓడించేందుకు పావులు కదిపేవారు కూడా ఉన్నారు. దాంతో ఆయన గెలుపుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. టీడీపీలో పల్లాను బలిపశువు చేసి పవన్ని గెలిపిస్తారన్న ప్రచారం కూడా పల్లా వర్గాన్ని కలవరపెడుతోంది. ఇక క్రాస్ ఓటింగ్ భయం కూడా టీడీపీకి పట్టుకుంది. జనసేన విషయానికి వస్తే ఇక్కడ గంగవరం పోర్ట్  మత్యకారులు ఉన్నారు. వారి ఓట్ల మీద పవన్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. నిన్న కూడా ఆయన అక్కడ రోడ్ షో చేశారు. దాంతో పవన్ సాలిడ్ గా కాపులు, మత్య్సకారుల ఓట్లతో పాటు, ఫ్యాన్స్ మీద ఆధారపడి రాజకీయ వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. చూడాలి మరి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: