Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 7:38 pm IST

Menu &Sections

Search

జగన్ అనే నేను : ఆ విప్లవం తెస్తాను !

జగన్ అనే నేను : ఆ విప్లవం తెస్తాను !
జగన్ అనే నేను : ఆ విప్లవం తెస్తాను !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇటీవల వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్టణం జిల్లా గాజువాక నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు సంచలన హామీలు ప్రకటించారు. రాబోయే రోజుల్లో వైసిపి పార్టీ అధికారం స్థాపించిన వెంటనే రాష్ట్రంలో ఉన్న రెండు లక్షలకు పైచిలుకు ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు.


అంతేకాకుండా గ్రామాలలో సచివాలయం ఏర్పాటుచేసి ఆ గ్రామంలో ఉన్న నిరుద్యోగులకు గ్రామ వాలంటీర్ గా 50 ఏళ్లకు ఉంచి ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇళ్లకు అందేలా చూసుకునే బాధ్యత నుంచి సదరు ఉద్యోగి కి ఉపాధి కల్పించేలా రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలలో ఇటువంటి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.


గత ప్రభుత్వం లా కాకుండా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు కల్పించేలా జగన్ అనే నేను ఉద్యోగ విప్లవం తీసుకువస్తున్నట్లు స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పిస్తా లేకపోతే ఇంటింటికి నిరుద్యోగ భృతి ఇస్తా అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేశారు ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి అని మరొకసారి అధికారం కోసం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను ఆకట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ మోసపోవద్దని జగన్ సూచించారు.


రాబోయే వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగి కి ఉద్యోగం కల్పించేలా అన్ని రకాలుగా బాధ్యత వైసిపి ప్రభుత్వం తీసుకుంటుందని..ముఖ్యంగా పరిశ్రమలు ఎక్కడైతే నెలకొల్పుతారో ఆ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు 75% లోకల్ రిజర్వేషన్ ఉండేలా చట్టాన్ని మొట్టమొదటి  అసెంబ్లీలోనే తీసుకువస్తానని హామీ ఇచ్చారు జగన్.



ap-election-2019-andhra-pradesh-politics-andhra-po
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Kranthi is an independent writer and campaigner.