ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హంగామా జోరుగా కొనసాగుతుంది.  ఇక ప్రచారానికి కొద్ది గంటలే సమయం ఉండటంతో నేతల ప్రచారాలు జోరందుకుంటున్నాయి.  అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ తమ శక్తి మేరకు ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.  తమదైన మేనిఫెస్టోతో ఓట్లు రాబట్టేందుకు కృషి చేస్తున్నారు.  మరోవైపు డబ్బు, మందు, కానుకల పంపకాలు సాగుతూనే ఉన్నాయి. ఓ వైపు పోలీసులు, ఈసి సిబ్బంది ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా..ఈ పంపకాలు మాత్రం ఎక్కడా నివారించలేక పోతున్నారు. 

ఎన్నికలు పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో జనసేనకు ఇబ్బందులు వచ్చి పడ్డాయి. నంద్యాల లోక్‌ సభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో అస్వస్థతకు గురైన ఆయనకు నంద్యాలలో ప్రథమచికిత్స చేయించి, హైదరాబాద్ కు తరలించిన సంగతి తెలిసిందే.   

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బంజారాహిల్స్ లో ఉన్న కేర్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి, ఆపై టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. యన ఆరోగ్య పరిస్థితిపై జనసేన వర్గాల్లో ఆందోళన నెలకొంది.  ప్రస్తుతం ఆయన చిన్న కుమార్తెను, పెద్ద అల్లుడిని బనగానపల్లి, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీలో నిలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: