చంద్రబాబు గురించి తన నీచ బుద్ధి గురించి ఆమంచి సంచలన ఆరోపణలు చేశారు. 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు, భన్వర్ లాల్ కు అక్రమ సంబంధం అంటగడుతూ ప్రచారం చేయండి.. అని చంద్రబాబు నాయుడు తమను ఆదేశించారు...' అని ఆమంచి కృష్ణమోహన్ ప్రకటించారు. ఆ సమావేశంతో తనతో పాటు మహిళా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మరో మంత్రి ఆదినారాయణ రెడ్డిలు కూడా ఉన్నారని ఆమంచి వ్యాఖ్యానించి సంచలనం రేపారు.


తను ఏదో ఊరికే ఈ మాటను చెప్పడం లేదని, చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారని. ఒకవేళ తను చెప్పింది అబద్ధమే అయినా.. చంద్రబాబు నాయుడు అలా అననట్టుగా అయితే.. దేవాన్ష్ మీద ఒట్టేసి చెప్పాలని ఆమంచి సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో అటు అధికారి కేరెక్టర్ పై చెడుముద్ర వేయడానికి, తన వైరిపక్ష ఎమ్మెల్యేపై నీఛమైన ముద్ర వేయడానికి చంద్రబాబు నాయుడు తెగించారని, తప్పుడు ప్రచారాన్ని చేయాలంటూ తమనే ఆదేశించారని ఆమంచి చెప్పారు.


ఒక ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తిపై మరీ ఈస్థాయి ఆరోపణలు రావడం విశేషం. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్లు వైఎస్ జగన్ సోదరి షర్మిలపై నానా రకాలుగా బురద జల్లారు. ఆ విషయంలో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తే అందుకు సంబంధించిన మూలాలు బాలకృష్ణ ఇంటిలో కదులుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ మాటలకు ప్రాధాన్యత లభిస్తోంది. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అంత దారుణమని, ఆయనదో నీఛమైన మనస్తత్వం అని ఆమంచి అంటున్నారు. ఎన్నికల ముందు లక్ష్మి పార్వతీ గారి మీద వచ్చిన ఆరోపణలకు తెర వెనుక చంద్రబాబు ఉన్నాడన్న మాటలకు బలం చేకూర్చుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: