చంద్రబాబునాయుడు ప్రసంగాలు వింటుంటే అసలు తనకు ప్రత్యర్ధెవరో తెలీక అయోమయంలో ఉన్నట్లు అనుమానం వస్తోంది.  ఎందుకంటే, మామూలుగా ఎవరికైనా తన ప్రత్యర్ధెవరో బాగా తెలిసే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి విషయమే తీసుకుంటే ప్రత్యర్ధి చంద్రబాబే అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయం తీసుకున్నా జగనే ప్రత్యర్ధి అన్న విషయం అర్ధమైపోతోంది.

 

కానీ చంద్రబాబు విషయంలోనే అయోమయం కంటిన్యూ అవుతోంది. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి ఏ బహిరంగసభలో చూసినా ఎక్కడ రోడ్డుషోలో పాల్గొన్నా కెసియార్, మోడి, జగన్ లను కలిపే తిడుతున్నాడు.  నిజానికి కెసియార్, నరేంద్రమోడిల గురించి ఎంత మాట్లాడినా లాభం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసిన ఇంతచిన్న విషయం కూడా చంద్రబాబుకు తెలియలేదంటే ఆశ్చర్యంగా ఉంది.

 

ఎక్కడ రోడ్డుషోలో పాల్గొన్నా, ఏ బహిరంగ సభలో పాల్గొన్నా చంద్రబాబును మాత్రమే జగన్ టార్గెట్ చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.  జగన్ అసలు పవన్ గురించి మాట మాత్రంగా కూడా పెద్దగా మాట్లాడటం లేదు. ఎందుకంటే, జగన్ దృష్టిలో పవన్ రాజకీయ నాయకుడు కాదు, జనసేన అసలు రాజకీయ పార్టీనే కాదు. అందుకనే పవన్ గురించి జగన్ పట్టించుకోవటం లేదు.

 

మరి ఇండస్ట్రీలో 40 ఇయర్స్ అనుభువం అని చెప్పుకునే చంద్రబాబు తన ప్రత్యర్ధి ఎవరో తేల్చుకోలేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. కెసియార్ ఆల్రెడీ సిఎం అయిపోయారు. కేంద్రింలో కూడా మళ్ళీ మోడినే అధికారంలోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి వాళ్ళిద్దరి గురించి మాట్లాడి ఏమిటి ఉపయోగం ?  అందుకే ప్రత్యర్ధిని ఎంచుకునే విషయంలో చంద్రబాబు బాగా కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు అర్ధమవుతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: