మూడు రోజుల్లో తెలిసిపోతుంది గుంటూరు ఘాటును తట్టుకునేదెవరో ? ఎందుకంటే, గుంటూరు పార్లమెంటు సీటులో విజయం కోసం పోటీలో చాలామందే ఉన్న ప్రధానంగా అందరి కళ్ళు మాత్రం టిడిపి అభ్యర్ధి సిట్టింగ్ ఎంపి గల్లా జయదేవ్, వైసిపి అభ్యర్ధి మోదుగుల వేణుగోపాలరెడ్డిపైనే. ఇద్దరికీ ప్లస్సులున్నట్లే కొన్ని మైనస్సులు కూడా ఉన్నాయి. అందుకనే పలానా అభ్యర్ధి గెలుస్తాడని చెప్పటం కష్టమే.


జయదేవ్ కున్న మైనస్సులేమిటంటే, ప్రజా వ్యతిరేకత. చంద్రబాబునాయుడు పాలనపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది. దానికితోడు వ్యక్తిగతంగా జయదేవ్ పై కూడా వ్యతిరేకత పెరిగిపోయింది. పోయిన ఎన్నికల్లో గుంటూరుకు పరిశ్రమలను తీసుకొస్తానని చెప్పిన ఎంపి మళ్ళీ అడ్రస్ లేరు. పైగా ఏ సమస్యను చెప్పుకుందామని వచ్చిన అందుబాటులో ఉండేది తక్కువనే చెప్పాలి. అధికార పార్టీ ఎంపి అనేకానీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధీ తక్కువే.

 

పార్లమెంటు పరిధిలోకి తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, గుంటూరు (తూర్పు), గుంటూరు (పశ్చిమం), ప్రత్తిపాడు, తెనాలి అసెంబ్లీలు వస్తాయి. వీటిల్లో అభ్యర్ధి లెక్కప్రకారమే  తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, పశ్చిమం నాలుగు నియోజకవర్గాలు మైనస్. పొన్నూరు, తెనాలిలో ఇబ్బంది లేదు. మంగళగిరి నియోజకవర్గమే అందరినీ అయోమయంలో పడేస్తోంది. సిట్టింగ్ ఎంఎల్ఏలందరిపైనా బాగా వ్యతిరేకత కనబడుతోంది.

 

అదే విధంగా వైసిపి అభ్యర్ధి విషయానికి వస్తే మోదుగుల గట్టి అభ్యర్ధి అనే చెప్పాలి. అసెంబ్లీ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న వారు కూడా గట్టివాళ్ళే. దానికితోడు జగన్ పై ఉన్న క్రేజ్, ప్రభుత్వ వ్యతిరేకత తోడైతే మోదుగుల గెలుపు ఈజీనే. మొన్నటి వరకూ ఇదే మోదుగుల గుంటూరు వెస్ట్ టిడిపి ఎంఎల్ఏనే. చివరి నిముషంలో పార్టీ మారి వైసిపి టికెట్ పై పోటీ చేస్తున్నారు.

 

ఇక సామాజికవర్గాలను చూస్తే 15.61 లక్షల ఓట్లున్నాయి. ఇందులో బిసిలు అత్యధికంగా 3.6 లక్షలున్నారు. కమ్మలు 2.20 లక్షలు, కాపులు 2 లక్షలు, ముస్లింలు 1.5 లక్షలు, మాదిగలు 1.4 లక్షలు, రెడ్లు 1.2 లక్షలు, మాలలు 1.6 లక్షలు, వైశ్యులు, బ్రాహ్మణులు 1.7 లక్షలున్నారు. వీరిలో  కమ్మ ఓట్లు టిడిపి పడతాయనటంలో సందేహం లేదు. అలాగే రెడ్ల ఓట్లు మోదుగులకు పడొచ్చు. ఇక బిసిలు, కాపులు తదితర సామాజికవర్గాల ఓట్లు ఎవరికి పడతాయో వారే విజేత అనటంలో సందేహం లేదు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: