పశ్చిమగోదావరి జిల్లాలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ఓటమి ఖాయం అయ్యింది. కుల రాజకీయాలకు దూరమని పదే పదే చెప్పే పవన్‌ చివరకు తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలతో పాటు, తన సోదరుడు నాగబాబు ఎంపీగా పోటీ చేస్తున్న నియోజకవర్గంలోనూ తన సామాజికవర్గం ఓట్లు అయిన కాపు ఓటర్లే అధికంగా ఉన్నారు. దీనిని బ‌ట్టి ప‌వ‌న్ త‌న‌తో పాటు త‌న సోద‌రుడి గెలుపున‌కు కులాన్నే న‌మ్ముకున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. పవన్‌ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న భీమవరంలో 70,000 కాపు ఓటర్లు ఉండగా పవన్‌ పోటీ చేస్తున్న మరో నిమోజకవర్గమైన గాజువాకలోనూ అదే స్థాయిలో కాపు వర్గం ఓటర్లు ఉన్నారు. ఇక పవన్‌ పట్టు పట్టి మరీ తన సోదరుడు నాగబాబుని నరసాపురం నుంచి ఎంపీగా రంగంలోకి దించారు. పైగా తాను పోటీ చేస్తున్న భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం సైతం నరసాపురం లోక్‌సభ పరిధిలోనే ఉంది. అన్నదమ్ముళ్లు ఇద్దరూ ఒకే ప్రాంతంలో ఉంటే ఆ ఎఫెక్ట్‌ ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఉంటుందన్నదే వీరి ప్లాన్‌. 


ఇక నరసాపురం లోక్‌సభ సెగ్మెంట్‌ పరిదిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాపు వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 3.70 ల‌క్ష‌ల‌ కాపు వర్గం ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడ ప్రధాన పార్టీలు అయిన టీడీపీ, వైసీపీ నుంచి క్షత్రియ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులు రంగంలోఉన్నారు. ఇప్పటి వరకు తాము పుట్టిన ఊరు ఉన్న ప్రాంతాన్ని ఏ మాత్రం పట్టించుకోని ఈ అన్నదమ్ముళ్లు ఇద్దరూ ఇప్పుడు ఎన్నికల వేళ‌ నామినేషన్లు వేసి ఓట్లు వెయ్యమంటే ఎవరూ వేసే పరిస్థితి లేదు. ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కొన్ని దశాబ్దాలుగా క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారే ఎంపీలుగా గెలుస్తూ వస్తున్నారు. చంద్రబాబు తొలి సారి ఇక్కడ వ్యూహాత్మకంగా 1996లో కాపు సామాజికవర్గానికి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడుకు సీటు ఇవ్వగా ఆయన విజయం సాధించారు. తర్వాత 2004లో కాంగ్రెస్‌ చేగొండి హరిరామజోగయ్యను రంగంలోకి దింపి మరో సారి సక్సెస్‌ అయ్యింది. ఈ రెండు ఎన్నికలు మినహా మిగిలిన ఎన్నికల్లో కాపు సామాజికవర్గం నుంచి పోటీ చేసిన వారు ఓడిపోతున్నారు. 


ఇక ఈ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓటర్లు 3,70,000 వరకు ఉండడం అటు టీడీపీ, వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వారు క్షత్రియ‌ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో పాటు ఆ సామాజికవర్గం ఓట్లు 70,000 మాత్రమే ఉండడంతో పవన్‌ తన అన్నను కేవలం తన కులాన్ని నమ్ముకునే ఇక్కడ పోటీ చేయిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అటు భీమవరంలోనూ  కేవలం కులాన్ని నమ్ముకునే పవన్‌ రంగంలోకి దిగాడన్నది ఓపెన్‌ సీక్రెట్‌. అన్నదమ్ముళ్లు ఇద్దరూ బలాల విషయానికి వస్తే సినీ గ్లామర్‌, కులాన్ని నమ్ముకోవడం మాత్రమే కనిపిస్తోంది. ఇక ఆర్థికంగా కూడా కనీసం కార్యకర్తలకు అవసరమయ్యే ఖర్చును కూడా ఇవ్వలేనంత పరమ పిసినారులుగా ఈ ఇద్దరు అన్నదమ్ముళ్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీ కేడర్‌లోనే వినిపిస్తున్నాయి. 


ఓ వైపు పార్టీకి పటిష్ఠమైన కేడర్‌ లేకపోవడం ఒక మైనెస్‌ అయితే కనీసం భూత్‌ స్థాయి ఏజంట్లు కూడా లేరు. నాగబాబుపై పోటీ చేస్తున్న ప్రత్యర్థులిద్దరూ ఆర్థికంగా బలంగా ఉన్నారు. అదే టైమ్‌లో భీమవరంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న గ్రంథి శ్రీనివాస్‌, టీడీపీ నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే అంజిబాబు కూడా ఆర్థికంగా దూసుకుపోతున్నారు. భీమవరంలో ఇప్పుడున్న పరిస్థితులు బట్టీ చూస్తే వైసీపీ విజయపు అంచుల్లో ఉండగా ఇక్కడ రెండూ మూడు స్థానాల కోసమే పవన్‌, టీడీపీ పోటీ పడుతున్నాయి. ఇక నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్న నాగబాబు మూడో స్థానంతో సరిపెట్టుకోవడం డిసైడ్‌కాగా ఆయనకు డిపాజిట్‌ అయినా దక్కుతుందన్నది సందేహంగా మారింది. ఏదేమైన సొంత జిల్లాను ఏ మాత్రం పట్టించుకోకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఈ మెగా ఫ్యామిలీ అన్నదమ్ముళ్లు ఇద్దరిని పశ్చిమ జనాలు చిత్తు చిత్తుగా ఓడించేందుకు రెడీగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: