తెలుగుదేశంపార్టీని అధికారంలోకి తేవటానికి చంద్రబాబునాయుడు పచ్చ మీడియా నానా అవస్తలు పడుతోంది.  లేని బలాన్ని ఉన్నట్లు చూపటం, జనాల్లో తీవ్ర వ్యతిరేకత కళ్ళకు కనబడుతున్నా లేదని నమ్మించాలని చూడటం కూడా పైత్యంలో భాగమే. మొన్నటి తెలంగాణాలో ఇదే విధమైన పైత్యాన్ని ప్రదర్శిస్తే అక్కడి జనాలు మొహం పగలగొట్టారు. అయినా బుద్ధి రాలేదు. ఏపిలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పైత్యం బాగా పెరిగిపోతుండటమే గమనార్హం.

 

ఇంతకీ విషయం ఏమిటంటే, రాబోయే ఎన్నికల్లో టిడిపికి 101 సీట్లు వస్తాయని ఓ పచ్చ మీడియా జోస్యం చెప్పింది. అదెలాగంటే, కార్పొరేట్ చాణుక్య అనే సంస్ధ చేసిన సర్వేలో మరోసారి చంద్రబాబుకే అధికారం అని తేలిందట. ఇంతకీ ఆ చాణుక్య ఎవరిదయ్యా అంటే గుంటూరు జిల్లాలో టిడిపి వినుకొండ ఎంఎల్ఏ జివి ఆంజనేయులు దగ్గర బంధువు అనీల్ కుమార్ దట. టిడిప ఎంఎల్ఏ దగ్గర బంధులు సంస్ధ సర్వేలో చంద్రబాబుకే అధికారం అనిరాకుండా జగన్మోహన్ రెడ్డే కాబోయే సిఎం అని వస్తుందా ?

 

అయినా పచ్చ మీడియా పిచ్చిగాని వడ్డించే వాడు మనవాడైనపుడు ఇచ్చేది 101 సీట్లేనా ? ఇచ్చేదేదో 150 సీట్లో లేకపోతే 160 సీట్లో ఇస్తే ఎంత ఘనంగా ఉండేది. బహుశా నమ్మకపోగా నవ్వుకుంటారన్న అనుమానం వచ్చుంటుంది లేండి. కాకపోతే మొన్నటిమొన్న ఓ ఐదు రోజుల క్రితం సర్వేలో 125 సీట్లు వస్తాయని చెప్పింది ఇదే మీడియా. దానికి లోక్ నీతి, సిఎస్ డిఎస్ సంస్ధ సర్వే అని చెప్పింది లేండి. దాంతో ఆ సర్వేకు తమకు ఏమీ సంబంధం లేదని సంస్ధ గట్టిగా చెప్పింది. దాంతో సదరు మీడియా మాడు పగిలిపోయింది.

 

అయినా చంద్రబాబు లెక్కేమో 150 సీట్లు. ఐదు రోజుల క్రితం ఇచ్చింది 125 అసెంబ్లీలు. తాజాగా ఇచ్చిందేమో 101 స్దానాలు.  అంటే జాగ్రత్తగా పరిశీలిస్తే సీట్ల సంఖ్య 150 నుండి 125కి అక్కడి నుండి 101కి తగ్గిపోయింది. మరి పోలింగ్ తేదీ నాటికి 50 సీట్లకు పడిపోతుందేమో ? ఎందుకంటే, పచ్చమీడియాలోనే సీట్ల సంఖ్య ఇంతలా తగ్గిపోతుంటే క్షేత్రస్ధాయిలో వాస్తవాలు ఇంకెంత కఠినంగా ఉందో.

 

ఎంతైనా స్వామి భక్తికదా ? అందుకనే వాస్తవం తెలిసినా మీడియాలో చెప్పలేకపోతున్నట్లున్నారు. చంద్రబాబు చెవిలో చెప్పే ఉంటారులేండి. అందుకనే మూడు రోజులుగా చంద్రబాబు మొహంలో భయం స్పష్టంగా తెలిసిపోతోంది అందరికీ. మొన్నటి పోస్టల్ పోలింగ్ లో కూడా మెజారిటీ ఓట్లు వైసిపికే పడ్డాయని ప్రచారం జరుగుతోంది. కాబట్టి అసలు బొమ్మ ఇంకెలాగుంటుందో అన్న టెన్షన్ చంద్రబాబులో పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, టిడిపి గెలవటం చంద్రబాబుకు ఎంత అవసరమో పచ్చ మీడియాకు అంతకన్నా ఎక్కువవసరం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: