Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 9:35 pm IST

Menu &Sections

Search

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో విడుదల!

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా  బీజేపీ మేనిఫెస్టో విడుదల!
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో విడుదల!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

భారత దేశంలో అన్ని జాతీయ పార్టీలూ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే.  భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం వెల్లడించింది.  ‘సంకల్ప్ పత్ర్’ (వాగ్దానాల పత్రం) పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దీనిని విడుదల చేశారు.   ఈ క్రమంలో బీజేపీ కూడా మేనిఫెస్టోని రిలీజ్ చేసి... ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధిని వివరించింది. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా మేనిఫెస్టోని రూపొందించామన్న బీజేపీ పెద్దలు... మరోసారి మోదీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రధానంగా ఉగ్రవాదం, అభివృద్ధి, మహిళా సాధికారత, రామమందిర నిర్మాణం వంటి అంశాలపై దృష్టిసారించింది. నిరుద్యోగ సమస్య దేశాన్ని పట్టిపీడిస్తుండటంతో యువతకు ఉపాధి, నైపుణ్యాల కల్పనపైనా బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రస్తావన ఉంది.


అమిత్ షా మాట్లాడుతూ.. 2014 నుంచి 19 వరకు ఈ ఐదేళ్లూ భారత దేశ చరిత్రలో సువర్ణాధ్యయంగా అభివర్ణించారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో సాగుతోందని షా వ్యాఖ్యానించారు. సమాఖ్య స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని, 12 లక్షల కుంభకోణాలను వెలుగులోకి తెచ్చామని షా వివరించారు. ప్రజల ఆకాంక్షలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు.  సంకల్ప పాత్ర’ కోసం మేము 6 కోట్ల మంది నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నాం. 2014లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్ధిక ప్రగతిలో భారత్ 11వ స్థానంలో ఉంది. ఇవాళ 5వ స్థానానికి ఎగబాకింది.. అని పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ... ‘‘రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో అనేక హామీలు ఇస్తూ, హామీలను నమ్మలేని వాతావరణం సృష్టిస్తున్నా యి. మేనిఫేస్టో నవభారత నిర్మాణానికి నాంది పలుకుతుందని తెలిపారు. దేశ ప్రధానికిగా ప్రజల విశ్వాసాన్ని మోదీ చూరగొన్నారని కొనియాడారు.  2022 వరకూ 75 లక్ష్యాలు పెట్టుకున్నామని వివరించారు. గ్రామీణాభివృద్ధికి రూ.25 లక్షల కోట్లు ఖర్చుచేస్తామని, దేశం నుంచి తీవ్రవాదాన్ని సమూలంగా తరిమివేస్తామని ఆయన స్పష్టం చేశారు.  


 బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్య అంశాలు :


- దేశ శ్రేయస్సు కోసం ఉమ్మడి పౌర స్మృతి బిల్లు ప్రవేశం

- ప్రధానమంత్రి ఫసల్ భీమో యోజన కింద అందరికీ భీమా వర్తింపు

- చిన్న, సన్నకారు రైతులకు పింఛను

- అన్ని వర్గాల రైతులకూ కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తింపు

- రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాల సరఫరా.

- రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులపై లక్ష రూపాయల వరకు తీసుకునే రుణాలకు వడ్డీ రాయితీ

- జమ్మూకాశ్మీర్‌లో శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రయత్నాలు

- ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం, జాతీయ భద్రత, తీరప్రాంత రక్షణ, సైనికుల సంక్షేమానికి పెద్దపీట

- వ్యవసాయ గ్రామీణ రంగానికి రూ.25 లక్షల కోట్ల పెట్టుబడి

- రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వర్తింపు

- చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్ పథకం, చిన్న వ్యాపారులకు పెన్షన్ పథకం అమలు

- భారత్ నెట్ ద్వారా 2022 నాటికి అందరికీ ఇంటర్నెట్

- జల్ జీవన్ మిషన్ ద్వారా 2024 నాటికి అందిరికీ తాగు నీరు

- సడక్ సే సమృద్ధి ద్వారా అందరికీ రోడ్లు

- ఆక్వాకల్చర్‌కు తేలిగ్గా రుణ సదుపాయం

- సముద్ర గడ్డి పెంచే దిశగా రైతులకు సదుపాయాలు

- 2022 నాటికి అందరికీ పక్కా ఇళ్లు

- స్వచ్ఛ భారత్ మిషన్ కింద వృథా నీటిని తిరిగి మంచి నీరుగా మార్పు

- దేశవ్యాప్తంగా గిడ్డంగుల నెట్‌వర్క్ ఏర్పాటు

- ఆర్గానికి ఫార్మింగ్‌లో లాభాలు పెరిగేందుకు చర్యలు

- మత్య్స సంపద యోజన కింద రూ.10 వేల కోట్లు కేటాయింపు

- రూ.5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థకు సరికొత్త రోడ్ మ్యాప్

- ప్రపంచ వ్యాప్తంగా యోగా విస్తరణ, ప్రచారం

- స్టార్టప్స్ పెంచేందుకు సీడ్ స్టార్టప్ ఫండ్ కింద రూ.20,000 కోట్లు కేటాయింపు

- ఐదేళ్లలో ఇప్పుడున్న 101 విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు

- 2022 నాటికి అన్ని రైల్వే ట్రాకులనూ బ్రాడ్ గేజ్‌గా మార్పు

- 2022 నాటికి అన్ని రైల్వే ట్రాకులకూ ఎలక్ట్రిఫికేషన్

- 2022 నాటికి అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో వై-ఫై సౌకర్యం

- 2024 నాటికి రూ.100 లక్షల కోట్ల మూలధన పెట్టుబడి

- మేకిన్ ఇండియా నినాదానికి మరింత గుర్తింపు

- 2022 నాటికి అన్ని గ్రామ పంచాయతీలకూ హై స్పీడ్ ఆఫ్టికల్ ఫైబర్ ఏర్పాటు


bjp-releases-election-manifesto-pm-modi-amit-shah-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీఎం రమేష్ మేనళ్లుడు..ఆత్మహత్య..కారణం అదేనా!
జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
తెలంగాణలో మొదలైన్న ఎన్నికల హడావుడి!
విశాఖలో డ్రగ్స్..మూలాలు అక్కడ నుంచే..!
ఆసక్తి రేపుతున్న ‘బ్రోచేవారెవరురా’టీజర్!
అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు..పాండ్యా, కేఎల్ రాహుల్ రూ. 20 లక్షలు జరిమానా..!
కిక్కుమీద ఉన్నాడా? వర్మ తాటతీస్తా అంటూ...!
వర్మ ‘కేసీఆర్ టైగర్’పాత్రలు!
దటీజ్ మహేష్!
బాబోరు ఆంధ్రా శ్రీరామచంద్రుడట : ఏంటో వెర్రి వెయ్యంతలు ?
నానీ నీ యాక్టింగ్ సూపర్ : ఎన్టీఆర్
రాష్ట్ర ప్రజల విశ్వాసం బాబు కోల్పోయాడు : బోత్స
రోడ్డు ప్రమాదంలో మురళీమోహన్ కోడలికి తీవ్ర గాయాలు!
ఫ్యామిలీతో అలీ..జాలీ జాలీగా..
 కేశినేని, బుద్దా, బోండాలకు ఏపి హైకోర్టు షాక్!
మహేష్ మూవీలో బండ్ల!
కాంచన 3 హిట్టా..ఫట్టా..!
హార్థిక్ పటేల్ చెంప ఛెల్లుమనిపించాడు!
మహేష్ బాబుకి  అప్పుడు తండ్రి..ఇప్పుడు విలన్!
మళ్లీ తెరపైకి కలర్స్ స్వాతి!
కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.
నటుడు మురళీ మోహన్ కి మాతృవియోగం!
ఖర్మ : చెప్పుతో కొట్టించే దగ్గరకొచ్చింది మన భారతీయ సంస్కారం?
ఇప్పటికీ అందాల ఆరబోత!
హాట్ లుక్ తో నిధి అగర్వాల్!
మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
40 ఏళ్ల ఇండస్ట్రీ బోబోరికి ఎన్నికల కమీషన్ పాఠాలు?
2 వేల కోట్లు : ఇదీ నయీం ఆస్తుల లెక్క?
డాడీ..! నువు దొంగ..తప్పలేదు కన్నా?!
రెండో విడత పోలింగ్..ఓటేసిన ముఖ్యమంత్రులు, సినీస్టార్లు!
రేపు 12 రాష్ట్రాలు 96 స్ధానాల్లో ఎన్నికలు..ఉత్కంఠతో నేతలు!
జెర్సీ...టాలీవుడ్ టాక్ ఎట్టా ఉందంటే!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED