చీరాల నియోజక వర్గంలో ఆమంచి 2014లో స్వతంత్ర అభ్యర్థిగా భరిలోకి దిగి తన స్వంత ఛరిస్మాతో ఘన విజయం సాధించాడు. అయితే మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య శిష్యునిగా భావించే.. ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. వరుసగా రెండు సార్లు గెలిచిన ఆమంచి.. తెలుగురాజకీయాల్లో అత్యంత సీనియర్, అద్దంకి నియోజకవర్గంలో దశాబ్దాల పాటు వర్గ రాజకీయాలకు కేంద్ర బిందువైన కరణం బలరామకృష్ణ మూర్తి ఎన్నికల సమరంలో తలపడుతుండటంతో ఈ స్థానంలో గెలుపెవరిది అనేదానిపై జిల్లా అంతటా ఆసక్తి నెలకొంది.


ఇద్దరూ జిల్లాలో బలమైన కాపు, కమ్మ సామాజికవర్గాలకు చెందిన వారు కావడం, రాజకీయ వ్యూహాలు పన్నడంలో ఉద్దండులు కావడంతో.. ఇక్కడ పోరు హోరా హోరీగా సాగుతూ.. విమర్శలు ప్రతివిమర్శల స్థాయి దాటి.. హైకోర్టుకు కూడా చేరింది. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత టీడీపీలో చేరారు. చివరి నిమిషంలో సీఎం చంద్రబాబు, జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్థన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఆయన వైసీపీలో చేరడంతో టీడీపీ ఈ స్థానంలో ఆమంచిని ఓడించడమే లక్ష్యంగా కరణం బలరామకృష్ణమూర్తిని బరిలో నిలిపింది.


దీంతో అక్కడ రాజకీయాలు వేగంగా మారిపోయాయి. అయితే టీడీపీ అభ్యర్థి బలమైన నేత అయినప్పటికీ .. ఆమంచికి పార్టీతో సంభందం లేకుండా విజయాన్ని నమోదు చేశాడు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీ నుంచి పోటీని ఎదుర్కొని గెలిచాడంటే ఈ సారి పార్టీ అండతో ఆమంచి విజయం ఇంకా సులభం అని చెప్పాలి. గట్టి పోటీ టీడీపీ అభ్యర్థి ఇచ్చినప్పటికీ ఆమంచికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: