అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం లో ఎన్నికల హడావిడి జోరందుకుంది. టిడిపి మరియు వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు తమ బలా, బలహీనతలను బేరీజు వేసుకుని  ప్రజల్లో మద్దతు కూడగట్టుకుంటున్నారు.

అభ్యర్థులు : టీడీపీ నుంచి వరదపురం సూరి బరిలో ఉండగా వైయస్సార్సిపి పార్టీ నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పోటీ చేస్తున్నారు. 2009 లో వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి గెలుపొందారు. కానీ  2014లో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇరు పార్టీలు పట్టు కోసం ప్రధానంగా గ్రామాలను లక్ష్యంగా చేసుకొని ప్రచారం మొదలుపెట్టారు. అయితే జనసేన పార్టీ  విడుదల చేసిన  అభ్యర్థుల జాబితాలో ధర్మవరం నియోజకవర్గం నుంచి మధుసూదన్ రెడ్డి  బరిలో దిగుతున్నటు ఆయన ప్రకటించారు. ఇక ఇక్కడి నుంచి కాంగ్రెస్, బీజేపీ రెండు పోటీ చేయట్లేదు. 

ప్రజల స్పందన : ప్రజల్లో టీడీపీ మరియు వైసీపీ పార్టీలు బలంగా తిరుగుతున్నాయి. వారు ప్రధానంగా గ్రామాలను లక్ష్యంగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే ప్రజల మొగ్గు చూపు మాత్రం వైసీపీ వైపే ఉంది. చంద్రబాబు చెప్పే మాటలను నమ్మే స్థితిలో జనాలు లేరని తెలుస్తుంది. మొన్న కొన్ని సర్వేలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి.

గెలుపెవరిది ? : వైసీపీ పార్టీ బలం చూస్తుంటే ఈసారి గెలుపు అటు వైపే అనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ ప్రచారం చేసినప్పుడు ఇక్కడి ప్రజల్లో వచ్చిన స్పందనే ఇందుకు ఉదాహరణ. ఇక టీడీపీ కు అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గెలుపు కష్టం అనే చెప్పాలి. ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ కి డిపాజిట్ లు రావడం కష్టం అంటున్నాయి సర్వేలు.ప్రజలు కూడా ఆ పార్టీ పై అంత ఆసక్తి చూపడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: