కుప్పం నియజకవర్గం ను పెద్దగా పరిచయం చేయ వలసిన పనిలేదు. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోటీ చేసే నియోజకవర్గం కాబట్టి సాధారణంగానే అంచనాలు నెలకొంటాయి. అలాంటి పరిస్థితే ఇక్కడ కనిపిస్తుంది కానీ కొంత లోతుగా చూస్తే ప్రజలలో వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది. 

అభ్యర్థులు : టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు ఖరారు అభ్యర్థి , వైసీపీ నుంచి చంద్రమౌళి పోటీ చేయగా జనసేన నుంచి వెంకట రమణ బరిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి తులసి నాథ్ ,బీజేపీ నుంచి సురేష్ బాబు నిలబడ్డారు.

బలాబలాలు : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గారు తొలి సారిగా ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచి అప్పటి నుండి ఈ నియోజకవర్గం లో చంద్రబాబునాయుడు కు తిరుగు లేకుండా పోయింది.వరుస గా ఆరు సార్లు ఎమ్మెల్యే గా చక్రం తిప్పారు.ఇంతటి క్లిష్ట పరిస్థితులలో టీడీపీ కి పోటీ గా గెలవడం అంటే కష్ట సాధ్యం అయిన పని. గత ఎన్నికల్లో బాబు కు పోటీ గా నిలబడ్డా చంద్రమౌళి ఏ ఇప్పుడు కూడా వైఎస్సార్సీపీ పార్టీ నుంచి పోటీ చేయబోతన్నారు.

వైసీపీ హవా : పార్టీ సిద్ధాంతాలను ప్రజల లోకి బలంగా తీసుకెళ్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. చంద్రబాబు ఈ టర్న్ ల పర్వం వైసీపీ కి బాగా కలిసివచ్చే అంశం. పక్క నియోజకవర్గాల్లో కూడా కొంత అసంతృప్తి ఛాయాలు కనిపిస్తున్నాయి అని తెలుస్తుంది. కాబట్టి గెలవడం అనే మాట కాకుండా టీడీపీ మెజారిటీ తగ్గే అవకాశాలు బాగా ఉన్నాయి.

గెలుపు ఎవరి వైపు ? : ఈ ప్రశ్నకు సమాధానం గా ఎవరిని అడిగిన టక్కున టీడీపీ దే అని చెప్పేస్తారు కానీ ఈ సారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ చుక్కలు చూపిస్తుంది. ఆ నియోజకవర్గ ప్రజలే హోదా విషయంలో ఆయన తీసుకున్న యూటర్న్ ల తో విసిగి పోయివున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ గెలుపు కష్టం కాకపోయినా మెజారిటీ మాత్రం చాలా వరకు తగ్గొచ్చు అన్నది విశ్లేషకుల అంచనా

మరింత సమాచారం తెలుసుకోండి: