తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన భార్య నందమూరి బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మని లోకేష్ తరఫున మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం చేసింది. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 2014 ఎన్నికలలో దేశంలో ఎవరికీ జరగని రుణమాఫీ ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని పేర్కొన్నారు.


అనేక సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయని ముఖ్యంగా అన్నా క్యాంటీన్ల ద్వారా అనేక మంది పేదలకు చంద్రబాబు గారు రోజు భోజనం పెడుతున్నారని మంచి పౌష్టికాహారం ప్రజలకు దొరకాలని బలమైన సంకల్పం తో తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో నిర్వహిస్తున్నారని నారా బ్రాహ్మణి పేర్కొంది.


ఇంకా నారా లోకేష్ గురించి మాట్లాడుతూ మంత్రిగా ఉన్న సమయంలో మంగళగిరి నియోజకవర్గం దగ్గరలో అనేక పరిశ్రమలు బయటనుండి తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పించిన ఘనత నారా లోకేష్ కి దక్కుతుందని..నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే కచ్చితంగా నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుందని ...


ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నిటిని తీర్చగల సమర్థమైన నాయకత్వం నారా లోకేష్ కి ఉందని రాబోయే ఎన్నికలలో నారా లోకేష్ ని గెలిపించాలని మంగళగిరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు నారా బ్రాహ్మణి. అయితే మొత్తం ప్రసంగం విన్న మంగళగిరి ప్రజలు నారా లోకేష్ కంటే నారా బ్రాహ్మణి చాలా బాగా తెలుగు మాట్లాడుతుందని కష్టమైన పదాలు సులువుగా మాట్లాడుతుందని బ్రాహ్మణి ఇచ్చిన స్పీచ్ కి కితాబు ఇస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: