టిడిపి అనుకూల మీడియా..తెలుగు మీడియాలో దాదాపు 90 % ఛానళ్లు,టివిలు, పత్రికలు, వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళు ఈ కోవలోకే చెందుతాయంటారు ఆంధ్ర రాజకీయ విశ్లేషకులు.


ఏది - ఏమైనా ఎలాంటి వార్తనయినా చంద్రబాబు నాయకత్వ తెదేపాకు అనుకూలంగానే ప్రసారం చేస్తాయని అంటుంటారు ప్రతిపక్ష నాయకులు. అలాంటి  తెదేపా అనుకూల టివి ఛానళ్ళు ఎన్నికలకు రెండు రోజుల ముందుగా సంచలనానికి తెరలేపాయి.


అదేంటంటే.. పవన్ కళ్యాన్ కింగ్ మేకరని ప్రచారం చేయడం మొదలు పెట్టాయి.  అస్సలు ఇలాంటి ప్రత్యేక పరిస్థితులలో చంద్రబాబు ని తప్ప మరొకరిని చూపించను కూడా - చూపించని ఛానెళ్ళు ఏకంగా పవన్ కింగ్ మేకర్ అని చూపించడం వ్యూహాత్మకమా లేక రానున్న పరిస్థితిలో గుడ్డి కన్నా మెల్ల మేలన్నట్లు...అటు - ఇటు ఊగిసలాడుతున్న కాపు ఓట్లను పవన్ వైపునకు లాగే ప్రయత్నమా అని చర్చించుకుంటున్నారు ఆంధ్రప్రజ.


పవన్ కింగ్ మేకరంటే తెదేపా గెలిచే అవకాశాలు ఏమాత్రం లేనట్లే అని తెదేపా అనుకూల మీడియా పసిగట్టడమే కాదు, పబ్లిక్ గా ఒప్పుకోవడమే, ఎన్నికలకు ముందు కాడి పడేయడమే..మరి ఇది ఎంత వరకు నిజమో వ్యూహాత్మకమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: