అనంతపూర్ జిల్లా నియోజకవర్గాల్లో ఉన్న ప్రముఖ నియోజకవర్గాలలో రాయదుర్గం కూడా ఒకటి. రాయదుర్గం లో ఎన్నికల జోరు కొనసాగుతుంది. పార్టీ నాయకులు ఎక్కువ సమయం ప్రజలతో ఉండేందుకు చూస్తున్నారు.

అభ్యర్థులు : టీడీపీ పార్టీ నుంచి కాలువ శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. అటు వైసీపీ నుంచి కాపు రామచంద్రారెడ్డి బరి నిల్చోగ, జనసేన నుంచి బరిలోకి మంజునాథ్ గౌడ పోటీ చేయబోతున్నారు.

రాజకీయ గత చరిత్ర : రాయదుర్గం నియోజకవర్గం 1955 లో ఏర్పడింది. అప్పటినుంచి ఇక్కడ పద్నాలుగు సార్లు ఎన్నికలు జరుగగా అటు అధికారికంగా కాంగ్రెసు ఎనిమిది సార్లు విజయం సాధించింది. మూడు సార్లు టీడీపీ, రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 2012 లో జరిగిన ఉపఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. 1955 లో శేషాద్రి ఇక్కడి నుండి తొలి ఎమ్మెల్యేగా గెలిచారు. రాయదుర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తుంది. ఇక్కడ టీడీపీ 1994 లో తొలిసారిగా విజయం సాధించింది. ఆ తర్వాత ఒక్కసారి, మరోసారి గెలుస్తూ వస్తుంది. 1999 లో అనంతపురం ఎంపీగా పోటీ చేసిన శ్రీనివాసులు ఆ తరవాత 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. 2014 లో రాయదుర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితి : అందరు నేతలు తమ తమ సిద్ధాంతాలను , మానిఫెస్టో లోని అంశాలను బలంగా తీసుకెళ్ళి ప్రజల్లో తమ బలాన్ని పెంచుకుంటున్నారు. ఇక్కడి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు విజయ ధిమా తో ఉన్నారు. వైసీపీ నేతలు తమ నవరత్నాలే  శ్రీరామ రక్ష ,అదే మా గెలుపు కు దోహదపడుతుంది అంటున్నారు. ప్రజలు ఎక్కువ శాతం వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. టీడీపీ పై అసమ్మతి ఛాయలు నెలకొన్నాయి. 

గెలుపెవరిది :  టీడీపీ నేత శ్రీనివాసులు నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని అతని వైఫల్యాలు తమకు లాభిస్తాయి అని వైసీపీ నేతలు అంటున్నారు. టీడీపీ నుంచి కాలువ శ్రీనివాసులు పోటీ చేయగా వైసీపీ నుంచి కాపు రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: