కర్నూల్ జిల్లా డోన్ నియోజకవర్గం లో ప్రచార రథాలు హోరెత్తిస్తున్నాయి. గెలుపు కోసం నాయకులు ప్రచారంలో తిరుగుతూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. 

అభ్యర్థులు : టీడీపీ నుంచి కే.ఈ.ప్రతాప్ పోటీ చేయగా వైసీపీ నుంచి బుగున్న రాజేంద్ర నాథ్ నిలబడ్డారు. జనసేన పార్టీ తో పొత్తులు ఉన్న సీపీఐ పార్టీ నుంచి కే.రామాంజినేయులు పోటీకి దిగుతున్నారు.

నియోజకవర్గ ప్రాముఖ్యత : ఇది రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేసిన కోట్ల విజయభాస్కరెడ్డి ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కే.ఈ. కృష్ణమూర్తి కూడా ఇక్కడి నుంచి నాలుగుసార్లు విజయం సాధించారు. ఇటువంటి రాజకీయ ప్రాముఖ్యత కలిగిన ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచిన బుగ్గన రాజేంద్రనాథ్, టీడీపీ అభ్యర్థి ఈడిగా ప్రతాప్ పై విజయం సాధించి అసెంబ్లీ లో అడుగుపెట్టారు.

రాజకీయ చరిత్ర :డోన్ అసెంబ్లీ నియోజకవర్గం 1955 లో ఏర్పడింది. ఇప్పటివరకు ఇక్కడ పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి. మొదట కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు అధిక సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీలు ఆధిపత్యం పంచుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ కే.ఈ. కుటుంబం అత్యధిక సార్లు విజయం సాధించారు. 1978 లో కే.ఈ. కృష్ణమూర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికై విజయం సాధించి ప్రాతినిధ్యం వహించారు. ఆ తరువాత మరో మూడుసార్లు కాంగ్రెస్, టీడీపీ ల నుంచి విజయం సాధించారు. ఇక 2004 లో కోట్లసుజాతమ్మ బరిలో నిలిచి కోట్ల కుటుంబ వ్యక్తిగా  డోన్ రాజకీయాల్లో ప్రవేశించారు. అయితే 2009 లో ఈ స్థానాన్ని టీడీపీ తిరిగి కైవసం చేసుకుంది.

తాజా పరిస్థితి : ఇక్కడి తాజా రాజకీయ పరిస్థితి వైసీపీ వైపు ఊరకలు వేస్తుంది. ఎన్నికలు మూడు రోజులు కూడా లేని ఈ స్థితిలో నాయకులు ప్రచారాన్ని విసృతం చేస్తున్నారు. ప్రజల మొగ్గు చూపు వైసీపీ పైనే ఉంది. టీడీపీ కి వ్యతిరేకత ఎక్కువగా ఉంది. 

గెలుపెవరిది : ప్రజల స్పందన మరియు ఈ మధ్య విడుదలైన సర్వేల ప్రకారం వైసీపీ హావ నడుస్తుంది. టీడీపీ పార్టీ వైఫల్యాలు ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో జనసేన ప్రభావం అసలు కనిపించడం లేదు. ఇక మిగతా పార్టీలు అసలు పోటీలో నిలవలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: