జమ్మలమడుగు లో రాజకీయం వేడెక్కింది. పోటాపోటీగా ప్రచారాలు జరుగుతున్నాయి. నాయకులు ప్రజలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాలను టార్గెట్ చేశారు.

అభ్యర్థులు : టీడీపీ పార్టీ నుంచి రామసుబ్బారెడ్డి పార్టీకి టికెట్ ఇచ్చారు.వైసీపీ పార్టీ నుంచి సుధీర్ రెడీ పోటీ లో ఉండగా జనసేన పార్టీ నుంచి  అరిగేలా చిన్నగిరి వినయ్ కుమార్ ను పోటీ లో నిలబడ్డారు.

రాజకీయ చరిత్ర : ఇక్కడ ఆధిపత్యం కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీల మధ్య చేతులు మారుతూ వచ్చేది. పొన్నప్ప రెడ్డి కుటుంబానికి చెందిన శివారెడ్డి మరియు రామసుబ్బారెడ్డి వరుసగా నాలుగుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందారు. అయితే చివరి మూడు సార్లు మాత్రం ఆదినారాయణ రెడ్డి ఏకగ్రీవంగా జమ్మలమడుగులో తన సత్తా చాటారు. అయితే వైసిపి గుర్తు పైన గెలిచిన ఆదినారాయణరెడ్డి తరువాత టీడీపీలో మంత్రి కూడా అయ్యారు.

రామసుబ్బారెడ్డి ఆధిపత్యం : ఇక్కడ రామసుబ్బారెడ్డి కి మంచి పట్టు ఉంది. ఈ బలం తోనే ప్రజల్లో తిరుగుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నియోజకవర్గాన్ని అభివృధి పథం లో నడిపారాన్న పేరు రామసుబ్బారెడ్డి కి ఉంది. 

వైసీపీ ప్రభావం : ఇప్పుడు వైసీపీ పార్టీ ఇక్కడ మెల్లగా మెల్లగా తన బలాన్ని పుంజుకుంటుంది. తప్పకుండా ఇక్కడ తన ప్రభావాన్ని చూపిస్తూ టీడీపీ నీ దెబ్బ కొట్టేలా ఉంది. ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసుకుని గెలుపు కు సిద్దంగా ఉంది. 

గెలుపెవరిది : గెలుపు అవకాశాలు చాలా వరకు టీడీపీ వైపే ఉన్న వైసీపీ ఇప్పుడు ముందు కంటే ఇప్పుడు బలాన్ని పెంచుకుంది. జనసేన తన ప్రభావాన్ని ఈ ప్రాంతంలో చూపలేక పోతుంది. ప్రజలు కూడా ఈ సారి టీడీపీ కి వ్యతిరేక ధోరణి ఉన్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: