క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంపై చాలామంది దృష్టి పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అందరూ గాజువాక గురించే ఎక్కువగా ఎందుకు చర్చించుకుంటున్నారు ? ఎందుకంటే అక్కడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టే.

 

నిజానికి గాజువాకలో పవన్ కల్యాణ్ కు గెలిచేంత సీన్ ఏమీ లేదనే చెప్పాలి. రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం ఇదే. దాదాపు 3 లక్షల ఓట్లున్నాయి. ఇక్కడ బిసిలు, కాపులు తదితర సామాజికవర్గాల ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడి నుండి పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్ధి పల్లా శ్రీనవాసరావు, వైసిపి అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి కూడా గట్టివారే. పైగా స్ధానికులు కూడా. కాబట్టి నేరుగా ఎవరికి వారుగా పోటీ చేస్తే పవన్ గెలిచే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.

 

ఇక్కడ విషయాలను గమనించిన చంద్రబాబు తన అజ్ఞాతమిత్రుడు పవన్ ను గెలిపించాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇప్పటి వరకూ గాజువాకలో ప్రచారానికి రాలేదు. తన నియోజకవర్గంలో రోడ్డు షోలు చేయాలని పల్లా అడిగినా కూడా చంద్రబాబు పట్టించుకోలేదని సమాచారం. పైగా పవన్ కోసం త్యాగానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది.

 

గాజువాకలో పవన్ ను గెలిపించాలంటే సొంతపార్టీ అభ్యర్ధిని బలిచేయక తప్పదనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారట. అందుకే ప్రచారానికి దూరంగా ఉన్నారు. అంతేకాకుండా టిడిపి ఓట్లను పవన్ కు వేయించమని లోపాయికారిగా కొందరు నేతలకు చెప్పారని కూడా ప్రచారం జోరందుకుంది. పవన్ ను గెలిపించేందుకు సొంత అభ్యర్ధినే బలపశును చేయాలని చంద్రబాబు నిర్ణయించుకోవటం బాగానే ఉంది. మరి అందుకు స్ధానిక నేతలు, క్యాడర్ అంగీకరించొద్దు ?

 

ఒకవేళ టిడిపి నుండి జనసేన వైపు క్రాస్ ఓటింగ్ చేయించాలని ప్రయత్నిస్తే ఓటర్లు వైపిపికి వేస్తే టిడిపి పరిస్ధితేంటి ? సొంత ఓట్లనే టిడిపికి వేయద్దని చెప్పిన తర్వాత క్యాడర్ తో పాటు ఓటర్లు తమ సొంత నిర్ణయం తీసుకుని వైసిపి వైపు మళ్ళితే చేయగలిగేదేముంటుంది ?  పైగా పవన్ స్ధానికేతరుడనే ప్రచారం ఇప్పటికే జోరందుకుంది.  నియోజకవర్గంలోని స్టీల్ ప్లాంట్ తో పాటు ఇతర ఫ్యాక్టరీల కార్మిక యూనియన్ నేత మంత్రి రాజశేఖర్ వైసిపిలో చేరిన తర్వాత బాగా ఊపుకనిపిస్తోందట. దానికితోడు జగన్ రోడ్డు షో అదుర్స్ అనే స్ధాయిలో జరిగింది. కాబట్టి పవన్ గెలుస్తాడో లేదో చెప్పలేం కానీ టిడిపి అభ్యర్ధి మాత్రం బలిపశువు అయిపోయాడనే అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: