తెలుగుదేశం పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రైతులు, ఉద్యోగులు అంతా సంతోషంగా ఉన్నారు. ఆర్జీజీఎస్ లెక్కల ప్రకారం.. నూటికి 90 శాతం మంది సంతృప్తస్థాయికి చేరుకున్నారు. ప్రచారంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం ప్రభంజనం కనిపిస్తోంది.. 


ఇవన్నీ నేను చెబుతున్నమాటలు కాదండోయ్..ఇటీవల ఎన్నికల ప్రచారసభల్లో చంద్రబాబు చెబుతున్న మాటలు.. తన పాలన ప్రజలకు చాలా బాగా నచ్చిందని.. ఈసారి రాష్ట్రంలో తెలుగుదేశం తుపాను సృష్టిస్తుందని చంద్రబాబు నమ్మకంగా చెబుతున్నారు. అయితే గ్రౌండ్ రియారిటీలో సీన్ పూర్తిగా వేరుగా ఉందంటున్నారు ఆంధ్రప్రజ. 

తుపాను కాదు కదా.. కనీసం వర్షం స్థాయి కూడా తెలుగుదేశానికి లేదని చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం చంద్రబాబు అనుభవం చూసి.. ఓటేసి గెలిపిస్తే.. ఆ అనుభవం ఏమాత్రం ఉపయోగపడలేదని ఆంధ్రప్రజ భావిస్తోంది. మేలు చేయకపోగా.. జన్మభూమి కమిటీల తీరుతో పూర్తిగా విసిగిపోయాని ఆంధ్రప్రజ గట్టిగా చెబుతోంది. 

అసలు చంద్రబాబు తుపాను డైలాగు కూడ గుండెల్లోనుంచి వచ్చిందని కాదని జనం ఇప్పటికే గుర్తించారు. గెలుస్తామన్న నమ్మకం లేకనే చంద్రబాబు జగన్ మేనిఫెస్టోను కాపీ కొట్టేశారని చెబుతున్నారు. అందుకే మార్పు కోరుతున్నామని.. తమ తీర్పేమిటో ఓటుతో చెబుతామని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: