విశాఖ ఎంపీ స్థానంలో గత ఎన్నికల్లో జరిగిన పరాభవానికి వైసీపీ బదులు తీర్చుకుంటుందా.. ఈసారి ఇక్కడ ఎగిరేది వైసీపీ జెండాయేనా అంటే అవునంటోంది క్షేత్రస్థాయి పరిస్థితి. గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి ఇచ్చిన తెలుగుదేశం ఈసారి కూడా ఇక్కడ విజయం దూరమయ్యే పరిస్థితి ఉంది. 


మరోవైపు జనసేన తరపున వీవీ లక్ష్మీనారాయణ బరిలో దిగినా ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ జిల్లాలో గత ఎన్నికల్లో మిత్ర పక్షం బీజేపీతో కలిసి 12 నియోజకవర్గాలు తెలుగుదేశం గెలుచుకుంది. కానీ ఇప్పుడు పార్టీలో వర్గపోరు అసంతృప్తుతో తెలుగుదేశంలో గతం పరిస్థితి కనిపంచడం లేదు. 

నర్సీపట్నంలో  మంత్రి అయ్యన్నపాత్రుడు సొంత కుటుంబంలోనే పోరు ఎదుర్కొంటున్నారు. 
విశాఖ పార్లమెంట్ స్దానానికి టీడీపీ తరపున పోటీ చేస్తున్న భరత్ ఆర్థికంగా బలవంతుడే అయినా పార్టీలోని కుమ్ములాటలు అతనికి చేటు తెచ్చే పరిస్థితి ఉంది. ఇక వైసీపీ నుంచి బరిలో ఉన్న ఎంవివి సత్యనారాయణ తన పరిచయాలను విస్తృత స్దాయిలో వినియోగించుకుని ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. 

ఎమ్మెల్యే అభ్యర్దులతో విస్తృత పర్యటనలు రోడ్ షోలను నిర్వహిస్తున్నారు. తాను లోకల్ అని.. ఎలాంటి సమస్య వచ్చినా మీవెంటే ఉంటానని ప్రచారం చేస్తున్నాడు. జనసేన నుంచి వివి లక్ష్మినారాయణ పోటీలో ఉన్నా విద్యావంతులే కాస్త ఆయన గురించి ఆలోచించే పరిస్థితి ఉంది. గతంలో ఆయన అంటే క్రేజ్ ఉన్నా.. ఆయనే మరొకరి పార్టీలో చేరడంతో అంత ఆసక్తి కనిపించడం లేదు. 

టీడీపీ అభ్యర్థి భరత్‌కు తన దగ్గరి బంధువు అత్తయ్య మాజీ మంత్రి పురంధ్రేశ్వరి బరిలో ఉండటం మైనస్ పాయింట్ గా ఉంది. ఆమె చీల్చే ఓట్లు భరత్‌ కు నష్టం చేకూర్చే అవకాశం ఉంది. అలాగే గాజువాకలో పవన్ కల్యాణ్ పోటీకి దిగడంతో అది కూడా టీడీపీకి నష్టం చేకూర్చేఅంశంగా మారింది. మొత్తం మీద విశాఖలో మూర్తిగార మనవడు గెలవడం అంత సులభమేమీ కాదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: