జగన్ తన పాదయాత్రలో నవరత్నాల పేరుతో తొమ్మిది కీలక పథకాలు ప్రకటించారు. ఐతే... ఇటీవల టీడీపీ ఆ పథకాల్లో చాలా వాటిని కాపీ కొట్టి వాటికి పేర్లు మార్చి... తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని జగన్ సహా వైసీపీ నేతలు చాలా మంది అరోపించారు. అయితే ఉగాది రోజున జగన్ పరకటించిన హామీలు ఏవైతే ఉన్నాయో అటు ఇటుగా అవే టీడీపీ మేనిఫెస్టో లో కనిపించడం విశేషం. 


ఇప్పటికే జగన్ రెండు ఏళ్ల ముందు నవరత్నాల పేరిట కొన్ని హామీలు విడుదల చేస్తే .. చంద్రబాబు నాయుడు ఎంచక్కా వాటిని కాపీ చేసి అమలు కూడా చేశారు. చేస్తామని చెప్పిన వారు గొప్ప చెప్పి చేసిన వారు గొప్ప అని హడావిడి మనం చూసే ఉంటాము. అవ్వ తాతలకు పింఛన్ 2000 కు పెంచడం మనము చూసాము. అయితే ఉగాది న జగన్ ప్రకటించిన హామీల్లో ఒకటి మాత్రం బయటికి రానివ్వలేదని తెలుస్తుంది. 


దానికి జగన్ ఈ రోజు ఎన్నికల చివరి రోజు సాయంత్రం ప్రచారంలో ప్రకటించబోతున్నాడని కొంత మంది పార్టీ కీలక నేతల నుంచి అందుతున్న సమాచారం. అదేమిటంటే జగన్ 2014 లో రుణ మాఫీ హామీ ఇవ్వలేదు. కానీ బాబు హామీ ఇవ్వటం వల్ల ఏకంగా సీఎం అయిపోయాడు. అయితే ఈ దఫా జగన్ .. ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారికి మాత్రమే రుణమాఫీ చేసే విధంగా హామీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. ఇలా ప్రకటిస్తే గెలుపు అవకాశాలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: