ఇప్పటికే ప్రకటించిన అన్ని సర్వేలూ దాదాపు వైస్సార్సీపీ పార్టీదే విజయమని ప్రకటించాయి. టీడీపీ పార్టీకి పరాజయం తప్పదని చెప్పాయి. అయితే ఇప్పుడు రెండు రోజుల ఉన్న నేపధ్యంలో సుమారు 5,00,000 లక్షల సాంపిల్స్ తో వీడీపీ సర్వే చేసింది.  ముందుగా ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమని వీడీపీ అసోసియేట్స్ పేర్కొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 106 నుంచి 118 ఎమ్మెల్యే సీట్లను నెగ్గే అవకాశం ఉందని వివరించింది.


తెలుగుదేశం పార్టీ 65 నుంచి 54 సీట్లను నెగ్గే అవకాశం ఉంది. జనసేన కనీసం ఒక సీట్లో గరిష్టంగా మూడు సీట్లలో నెగ్గే అవకాశం ఉందని వీడీపీ అసోసియేట్స్ అంచనా వేసింది. ఇక ఏపీలో మరో పార్టీ ఏదీ ఎమ్మెల్యేలను నెగ్గించుకునే అవకాశాలు లేవు. ఓట్ల శాతం విషయానికి వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు నలభై నాలుగుశాతం ఓట్లను సంపాదించుకోవచ్చని పేర్కొంది. టీడీపీకి నలభైశాతం ఓట్లు రావొచ్చని అంచనా వేసింది. జనసేనకు దాదాపు పదిశాతం ఓట్లు రావొచ్చని పేర్కొంది. బీజేపీ రెండున్నర శాతం, కాంగ్రెస్ ఒకటిన్నర శాతం ఓట్లను పొందవచ్చని వివరించింది.ఇక కులాల వారీగా చూస్తే కాపు-బలిజల్లో మెజారిటీ మంది తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నారని, వైఎస్సార్సీపీ జనసేనల కన్నా కాపుల ఓట్లను తెలుగుదేశమే ఎక్కువ పొందుతుందని ఈ సర్వే పేర్కొంది.


రెడ్లలో డెబ్బైశాతం ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, పదిహేడు శాతం టీడీపీకి, జనసేనకు మూడుశాతం ఓట్లు పడతాయని పేర్కొంది. అదే కమ్మ వాళ్లలో ఎనభై తొమ్మిదిశాతం ఓట్లు తెలుగుదేశానికే పడతాయని పేర్కొనడం విశేషం. వైసీపీకి మూడుశాతం, జనసేనకు రెండుశాతం కమ్మ ఓట్లు పడతాయని వివరించింది. ఎస్సీ-ఎస్టీల్లో మెజారిటీ ఓట్ల శాతాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొందుతుందని ఈ సర్వే పేర్కొంది. ముస్లింలు, వైశ్యులు, రాజుల ఓట్లలో కూడా ప్రధాన షేర్ వైసీపీకే అని, అయితే బ్రహ్మణుల ఓట్లు మాత్రం తెలుగుదేశానికే ఎక్కువ పడతాయని ఈ సర్వే పేర్కొనడం విశేషం! 

మరింత సమాచారం తెలుసుకోండి: