రాజమండ్రి సభలో అలీ మీద పవన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సభలో పవన్ మాట్లాడుతూ అలీ కోసం నేను చాలా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేశాను. రేపోమాపో ఎమ్మెల్యే టిక్కెట్ ఇద్దాం అనుకున్నాను. ఈలోగా అలీకి ఏం మనసు మారిందో కానీ వెళ్లి వైసీపీలో జాయిన్ అయ్యారు. అలీ చెప్పాడని వాళ్ల బామ్మర్దికి కూడా నేను టిక్కెట్ ఇస్తే, అలీ మాత్రం నాకు చెప్పకుండా వెళ్లిపోయాడు. అలీ ఎందుకిలా చేశాడో నాకు అర్థంకాదు. పవన్ గెలవడు, జగన్ గెలుస్తాడని అలీ వెళ్లిపోయాడు."


ఇలా ఎన్నికల ముందు తన నైరాస్యాన్ని పూర్తిగా బయటపెట్టారు జనసేనాని. ఓ వ్యక్తి ప్రయాణాన్ని, అతడి వ్యక్తిత్వాన్ని చూడాలి తప్ప.. వెంటనే ఫలితాల్ని ఆశించకూడదంటున్నారు పవన్. తను ఏటీఎం మెషీన్ కాదంటున్నారు. పవన్ గెలవడని అంతా ఫిక్స్ అయిపోయారు. ఒకడు గెలుస్తాడని ఎలా తెలుస్తుంది. 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా స్టార్ట్ చేసినప్పుడు, ఒక రోజున పవన్ అనే వాడు ఏకంగా దేశప్రధానికి అత్యంత సన్నిహితుడు అవుతాడని ఊహిస్తారా ఎవరైనా. ఊహించరు కదా. అదొక ప్రయాణం. అతడి వ్యక్తిత్వం చూడాలి. వీళ్లకేమో వెంటనే రిజల్ట్ కావాలి. ఇనిస్టెంట్ బ్రూ కాఫీలాగ. నేనేమైనా ఏటీఎంనా. అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 


అయితే అలీ పవన్ వ్యాఖ్యలకు స్పందిస్తూ నేను పవన్ గారిని ఎప్పుడు విమర్సించలేదు. నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గరకు వెళ్లి సాయం అడిగింది లేదు. మీరు (పవన్ ) ..చిరంజేవి బాటలో నడిచారు. నేను మాత్రం ఎటువంటి సపోర్ట్  లేకుండా వచ్చాను. మీరేమి నాకు సహాయం చేయలేదు. నాకేమి అవకాశాలు ఇప్పించలేదు అని చెప్పుకొచ్చాడు. మీ మాటలు నన్ను భాద పెట్టాయని చెప్పాడు. నేను నా స్వంత డబ్బులతో రాజమండ్రిలో మా నాన్న పేరుతో ట్రస్ట్ ను నిర్వహిస్తున్నానని చెప్పుకొచ్చాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: