చంద్రబాబు దక్షత కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన వ్యూహాలకు మారు పేరు. ఆయనది మాస్టర్ మైండ్ అంటారు. ఆయన ఎత్తు వేస్తే ఎంతటి వారైనా చిత్తు కావాల్సిందే. నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవంలో బాబు తాను నమ్ముకున్న సిధ్ధాంతం ఒక్కటే. ఏలాగైనా గెలవడం. మరి బాబు ఆలోచనలు ఎపుడు గెలుపు అని కలవరిస్తాయి.

 


కానీ ఎల్ల కాలం ఒకేలా ఉండదు కదా. అందుకే బాబు తెలంగాణాలో మాస్టర్ ప్లాన్ వేసినా బొక్క బొర్లా పడ్డారు. జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా చక్రం తిప్పాలనుకుంటున్నా అసలు కుదరడంలేదు. ఏపీలో కూడా బాబు రాజకీయం ఇపుడు ఎదురు తన్నుతోందని సర్వేలు చెబుతున్నాయి. బాబుకు జగన్ చాలా చిన్న నాయకుడు. అతన్ని తేలిగ్గా తీసుకున్నారు. అయిదేళ్ల పాటు బాబు జగన్ విషయంలో అనుసరించిన వైఖరి ఇదే. ఎపుడూ ప్రతిపక్ష నేతగా జగన్ని చూసింది లేదు. మర్యాద ఇచ్చింది కూడా లేదు.

 


ఎన్నికల్లో జగన్ని అవినీతి పరుడుగా, నేరస్తుడుగా చిత్రీకరించి లబ్ది పొందాలన్న బాబు ప్రయత్నాలు గతసారి ఫలించాయి. ఈసారి ఫలించబోవని సర్వేలు తేల్చిచెబుతున్నాయి. ఏపీలో వచ్చేది జగన్ నాయకత్వంలోని వైసీపీ సర్కారేనని కచ్చితంగా లెక్కలు వేస్తున్నాయి. అన్ని రకాల జాతీయ సర్వేల సారాంశం ఇదే. కాస్త అటూ ఇటూ ఫిగర్స్ తేడా ఉండొచ్చు కానీ జగన్ గెలుపు ఖాయమని సర్వేలు తేల్చేశాయి. జనం మూడ్. జగన్ సభలకు వస్తున్న స్పందన కూడా కళ్ళెదుట కనిపిస్తోంది. ఇక పోలింగ్ లాంచనమేనని అంటున్నారు. మరి అదే జరిగితే బాబు ప్లాన్ బూమరాంగ్ అయినట్లే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: