సర్వేలు అన్నీ నిజాలు కావు. అలాగనీ కాకుండానూ పోలేదు. పక్కా ప్లాన్ తో ఓ పద్ధతితో చేసిన సర్వేలకు ఎపుడూ విలువ ఉంది. ఇక ఏపీలో రాజకీయంపై గత కొన్ని నెలలుగా వస్తున్న సర్వేలు అన్నీ ఏకపక్షంగా ఉంటున్నాయి. ఇలా అన్ని రకాల సర్వేలూ ఒకెలా చెప్పడం అరుదైన విషయం. తెలంగాణా ఎన్నికల్లోనూ ఇది జరగలేదు.

 


ఎపీలో సర్వేలు చూస్తే టీడీపీ, వైసెపీ మధ్యనే పోరు ఉందని స్పష్టంగా చెబుతున్నాయి. మిగిలిన పార్టీలన్నీ కలిపి చూసినా దరి దాపుల్లోకి రావడం లేదని కూడా లెక్క కడుతున్నాయి. మూడవ పార్టీగా వచ్చిన జనసేన కింగ్ మేకర్ అవతారం ఎత్తుతానని ఆశపడింది. సర్వేలను బట్టీ చూస్తే సింగిల్ డిజిట్ కే ఆ పార్టీ సీట్ల పరంగా ఓట్ల షేర్ పరంగా కానీ ఉంది. లేటేస్ట్ గా వచ్చిన రెండు సర్వేలు కూడా ఇదే విషయాన్ని కచ్చితంగా చెప్పాయి. అంటే అయిదు సీట్ల లోపే జనసేనకు వస్తాయని, పది శాతం లోపు ఓట్ల షేర్ ఉంటుందని లెక్కలు కట్టాయి.



అదే విధంగా కాంగ్రెస్, బీజేపీలను తీసుకుంటే మరీ దారుణంగా పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలకు సీట్లు రావని అన్ని జాతీయ సర్వేలు చెప్పడమే కాదు, ఓట్ల షేర్ కూడా దారుణంగా ఉందని చెబుతున్నాయి, రెండు శాతం కంటే ఓట్ల షేర్ మించదని పక్కాగా చెప్పేస్తున్నాయి. ఇక వామపక్షాలు, బీఎస్పీ వంటి పార్టీలు వన్ పర్సంట్ కంటే కూడా తక్కువగా ఓట్ల షేర్ రాబట్టుకుంటాయని తేల్చి చెబుతున్నాయి. ఇవన్నీ చూసినపుడు ఏపీలో పేరుకు బహుముఖ పోటీలు జరుగుతున్నాయి, తప్ప అసలైన పోటీ మాత్రం జగన్, చంద్రబాబు మధ్యనేనని క్లారిటీగా అర్ధమవుతోంది. ఇక ఏ పార్టీ గెలిచినా వందకు పైగా సీట్లతో పూర్తి మెజారిటీ వస్తుందని కూడా చెబుతున్నాయి. మరి ఈ సర్వే ఫలితాలు చూస్తే ఏపీలో పొలిటికల్ పోలరైజే షన్ ఏ స్థాయిలో జరుగుతోందో అర్ధమవుతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: