జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటుడు అలీపై చేసిన వ్యాఖ్యలు మాటలయుద్ధానికి దారి తీశాయి. చిన్న నటుడే కదా.. ఏదో ఒక మాట అనేద్దాం.. రాజమండ్రి కదా.. అలీని కామెంట్ చేస్తే స్పందన వస్తుంది.. అనే ఉద్దేశంతోనే.. లేక మరేదైన టార్గెట్‌తోనే తెలియదు కానీ.. పవన్ కల్యాణ్ అలీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


అందరూ నన్ను వెన్నుపోటు పొడుస్తున్నారు.. నేను సాయం చేసిన అలీ కూడా నన్ను కాదని జగన్ పార్టీలోకి వెళ్లాడు.. అని పవన్ కల్యాణ్ కామెట్ చేయడాన్ని అలీ తట్టుకోలేకపోయారు. ఇప్పటివరకూ వైసీపీలో చేరిన తర్వాత పవన్ పై ఒక్క కామెంట్ కూడా చేయని అలీ.. ఈసారి మాత్రం సున్నితంగానే ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. 

ఆలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డాను అని పవన్ అన్నారు. మీరు ఏ విధంగా సాయపడ్డారు పవన్ సర్. అంటే ధనం ఏమైనా ఇచ్చారా? నాకు ఏమైనా సినిమాలు చెప్పారా? సినిమాలు లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్లి అవకాశాలు ఇప్పించారా? సర్.." అని అలీ సూటిగా ప్రశ్నించారు. 
అంతే కాదు.. చిరంజీవి గారు వేసిన దారిలో మీరు వచ్చారు.. కానీ నేను నా దారి నేనే వేసుకున్నాడు.. నేనే నడిచి వచ్చాను అంటూ డైనమైట్ల వంటి మాటలు పేల్చారు. చాలా సున్నితంగా బాధాతప్త హృదయంతోనే పదునైన మాటలు వదిలారు అలీ. 

మీరు ఇండస్ట్రీలోకి రాకమునుపు నుంచి నేను ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాను సర్.. అంటూ తన నట ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేశారు. అలీ మాటలతో ఎవరు కష్టపడి పైకి వచ్చారో.. ఎవరు వారసత్వంగా సులువుగా స్టార్ అయ్యారో అర్థమయ్యేలా సున్నితంగానే అయినా కొరడాలంటి మాటలతో పవన్ నోరు మాయించారు అలీ.


మరింత సమాచారం తెలుసుకోండి: