ఓ నిజాయితీ పరుడుకి కోపం  వస్తే ఎలా ఉంటుంది.. ఓ ఆత్మగౌరవం ఉన్న వ్యక్తికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుంది.. ప్రేమించిన వారే తమను అకారణంగా అగౌరవ పరిస్తే ఓ మనసు ఎంత గాయపడుతుంది.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే.. ఈ వీడియో చూడండి. 


అందరూ నన్ను వెన్నుపోటు పొడుస్తున్నారు.. నేను సాయం చేసిన అలీ కూడా నన్ను కాదని జగన్ పార్టీలోకి వెళ్లాడు.. అంటూ పవన్ కల్యాణ్ కామెట్ చేయడాన్ని అలీ తట్టుకోలేకపోయారు. అలీ చిన్నతనం నుంచే కష్టపడి పైకొచ్చిన వ్యక్తి.. ఈవిషయం సినీ ఇండస్ట్రీ అందరికీ తెలుసు.

అందుకే పవన్ వ్యాఖ్యలపై అలీ ఘాటుగా స్పందించారు.. నేను ఎవ్వరి దగ్గరా అయ్యా! నేను కష్టాల్లో ఉన్నాను. రూపాయి సాయం చేయమని ఏనాడూ ఎవ్వరి దగ్గరా అడగలేదు" అని అలీ అన్నారు. అల్లా దయవల్ల చాలా బాగున్నానని, ఇంకా అడిగే అవకాశం వస్తే అప్పటికి ఆలీ ఉండడని..గుండెల్లో బాధ సుడులు తిరుగుతండగా అలీ మాట్లాడారు. అలాంటి పరిస్థితే వస్తే...ఆకలితో చచ్చిపోతాను తప్ప వెళ్లి అమ్మా.. దేహీ అనే స్థితికి వెళ్లనని అలీ అన్నారు. 

అసలు ఇంతకీ మారు నాకు ఏం సాయం చేశారు.. ఆలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డాను అని అన్నారు. మీరు ఏ విధంగా సాయపడ్డారు పవన్ సర్.. అంటే ధనం ఏమైనా ఇచ్చారా? నాకు ఏమైనా సినిమాలు చెప్పారా? సినిమాలు లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్లి అవకాశాలు ఇప్పించారా? సర్.." అని అలీ నిలదీశారు. మరి అలీ వ్యాఖ్యలపై పవన్ మళ్లీ స్పందిస్తారా.. ఇంతటితో ఈ వివాదం వదిలేస్తారా అన్నది చూడాలి



మరింత సమాచారం తెలుసుకోండి: