అలీ నన్ను మోసం చేశాడు.. నేను గెలవనని.. జగన్ పార్టీలోకి వెళ్లాడు.. నేను ఎంతో సాయం చేస్తే వెన్నుపోటు పొడిచాడు.. ఇవీ హాస్య నటుడు అలీ గురించి పవన్ రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలు... ఈ వ్యాఖ్యలపై అలీ కూడా అంతే ఘాటుగా .. కాకపోతే వినయంగా స్పందించారు. 


తాను ఎంతో సాయం చేశానన్న పవన్ వ్యాఖ్యలను అలీ ఖండించారు. మీరు నాకు ఎలా సాయం చేశారో చెప్పాలని నిలదీశారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకడం లేదని ఘటుగానే బదులిచ్చారు. అంతేకాదు.. మీరే చిరంజీవిపై ఆధారపడి సినీ ఇండస్ట్రీలోకి వచ్చారనే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. 

చిరంజీవిగారు వేసిన బాటలో మీరు వచ్చారు.. నా బాట నేనే వేసుకున్నా అనడం ద్వారా అలీ వాయిస్ రైజ్‌ చేశారు. ఇదే సమయంలో తాను చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన విధానాన్ని అలీ గుర్తు చేసుకున్నారు. నేను ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడి పైకి రాలేదు..  నా కష్టాన్ని నమ్ముకొని నేను పైకి వచ్చాను..అన్నారు అలీ. 

అంతే కాదు.. మీరు ఇండస్ట్రీ కి వచ్చే సమయానికి నేను ఇక్కడ చాలా మంచి పొజిషన్ లో ఉన్నానంటూ గుర్తు చేశారు. అప్పటికీ.. ఇప్పటికీ.. నేను నా కష్టాన్ని నమ్ముకొని ఉన్నాను. నేను ఆకలికి చచ్చిపోతాను కానీ, దేహి అని ఎవరి దగ్గరకు వెళ్ళాను కూడా.. అంటూ సీరియస్ గానే అలీ కామెంట్ చేశారు. తాను పవన్ కళ్యాణ్ కి చాలా గౌరవం ఇస్తానని.. కానీ తానూ ఇలా మాట్లాడటం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అలీ.



మరింత సమాచారం తెలుసుకోండి: