సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ తనిఖీల్లో కోట్లకు కోట్ల రూపాయల సొమ్ము పోలీసులకు దొరుకుతోంది. సోమవారం హైదరాబాద్ నారాయణ గూడ వద్ద దాదాపు 8 కోట్ల రూపాయల నగుదు దొరికిన సంగతి తెలిసిందే. ఈ సంగతి మరువక ముందే మరో ప్రాంతంలో కోట్ల లో సొమ్ము దొరికింది. 


హైదరాబాద్ లంగర్ హౌస్‌లో భారీగా నగదు పట్టుకున్నారు. సుమారు 2.4 కోట్ల రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ చేస్తున్న తనిఖీల్లో ఈ డబ్బు బయటపడింది. ఓటర్లను పంచేందుకు తీసుకువెళ్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. 

రెండు రోజుల క్రితం బంజారహిల్స్‌లో కూడా భారీగా నగదును గుర్తించారు బంజారాహిల్స్‌లో పోలీసుల తనిఖీల్లో కోటి రూపాయలు దొరికాయి. వాస్తవానికి తెలంగాణలో ఎన్నికల సందడి అంతగా లేదు.

కేవలం పార్లమెంటు ఎన్నికలు కావడంతో ప్రచార సందడి కూడా పెద్దగా లేదు. కానీ ఓట్లకు నోట్ల పంపిణీకార్యక్రమానికి నేతలు బాగానే ప్రిపేరైనట్టున్నారు. కోట్లకు కోట్లు దొరకడం చూస్తుంటే.. ఈ సొమ్మంతా ఎక్కడిదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విచిత్రంగా టైట్ ఫైట్ నడుస్తున్న ఏపీలో మాత్రం కోట్లలో సొమ్ము దొరకడం అంతగా కనిపించడం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: