మంగళగిరి నియోజకవర్గంలో గెలిపిస్తే అభ్యర్ధి ఆళ్ళ రామచంద్రారెడ్డికి మంత్రిపదవి ఖాయమేనా ? అవుననే చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మంగళగిరిలో ఆళ్ళ గెలుపుకోసం జగన్ రోడ్డుషోలో పాల్గొన్నారు.  ఆ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలపై ఆళ్ళ చేసిన పోరాటాలను గుర్తుచేశారు. అదే సమయంలో నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై చంద్రబాబునాయుడు చేసిన నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపారు.

 

జగన్ రోడ్డుషోకు జనాలు పోటెత్తారనే చెప్పాలి. నిజానికి ఈ నియోజకవర్గంలో ఆళ్ళను ఎదుర్కొనే సత్తా లోకేష్ కు లేదనే చెప్పాలి. కాకపోతే చంద్రబాబు కొడుకవ్వటంతో, అధికారం, డబ్బు అండగా ఉండటం వల్ల గట్టి పోటీ ఇస్తున్నాడనే భ్రమలు కల్పిస్తున్నారు. ఎలాగూ మెజారిటీ మీడియా చేతిలో ఉంది కాబట్టి లోకేష్ ను చంద్రబాబు మీడియా జాకీలేసి లేపుతోంది. అన్నింటికన్నా ప్రలోభాలకు లోటు లేదు. దాంతో ఇద్దరిలో ఎవరు గెలుస్తారనే విషయంలో స్పష్టత కనబడటం లేదు.

 

ఈ నేపధ్యంలో మంగళగిరిలో జరిగిన జగన్ రోడ్డుషోకు జనాలు విపరీతంగా హాజరయ్యారు. అదే సమయంలో ఆళ్ళ గెలిస్తే మంత్రిపదవి ఖాయమని జగన్ చేసిన హామీ కూడా ప్రజలపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా  వైసిపి అధికారంలోకి రాగానే ఇచ్చే ఎంఎల్సీ పదవుల్లో మొదటిది మంగళగిరిలోని చేనేతలకే ఇస్తాననే కీలకమైన హామీని కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో చేనేతల ఓట్లు సుమారు 50 వేల దాకా ఉన్నాయి. వాళ్ళంతా వైసిపికే ఓట్లేస్తే ఆళ్ళ గెలుపు ఖాయమే. అందకే జగన్ వ్యూహాత్మకంగా హామీ ఇచ్చారు. మరి జనాలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: