ఏపీలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి సీఎం చంద్రబాబు తాను చేసిన అభివృద్ధిని కాకుండా.. కేసీఆర్, మోడీ, జగన్‌లను తిట్టడానికే ప్రయారిటీ ఇచ్చారు. తెలంగాణ తరహాలో ఆంధ్రా సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు విఫల ప్రయత్నం చేశారు. కానీ ప్లాన్ అర్థం చేసుకున్న కేసీఆర్ బాబు ఎంత తిట్టినా సంయమనం పాటించారు. 


కేసీఆర్ మౌనంతో చంద్రబాబు నిరుత్సాహపడిపోయారు. ఎలాగైనా కేసీఆర్ ను రెచ్చగొట్టాలని అన్నిప్రయత్నాలూ చేశారు.. భద్రచలం మాదే అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ లేకుండా చేస్తామన్నారు.. చివరకు హైదరాబాద్ ఖాళీ చేస్తాం అనే రేంజ్‌కు వచ్చారు. అయితే కేసీఆర్ కామ్‌గా ఉండిపోయారు. 

కేసీఆర్ ప్రత్యేక హోదాకు అడ్డమని.. పోలవరాన్ని అడ్డుకుంటున్నాడని.. ఇలా ఎన్నో విమర్శలు చేశారు. దమ్ముంటే జగన్ కేసీఆర్‌ ను ఒప్పించాలని కూడా సవాల్ విసిరారు. ఇక ప్రచారం రేపు ముగుస్తుందనగా కేసీఆర్ చంద్రబాబుకు కోలుకోలేని పంచ్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలడంతో చంద్రబాబునాయుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. 

ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో 16 టీఆర్ఎస్, ఒక స్థానంలో ఎంఐఎం గెలుపుఖాయమని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని అన్నారు. పోలవరానికి కూడా  అడ్డుకాదని తేల్చి చెప్పారు. మా వాటా అడిగామే తప్ప.. కిందకు వృధా పోయే నీళ్లు మీరు వాడుకుంటే మాకేంనష్టమని క్లారిటీ ఇచ్చారు. దీంతో చంద్రబాబు ప్రచారానికి అడ్డుకట్టపడింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: