రాజ్యంలో కరవూ - కాటకాలు తాండవిస్తున్న వేళ, రాజుగారేమో విలాస మందిరంలో చలువరాళ్ల వేదికపై ఉల్లాసంగా గెడ్డం చేయించుకుంటూ క్షురకునితో మాట్లాడుతున్నాడిలా.. ఏమి క్షురకుడా..ఎలా ఉంది మా రాజ్యం.. దానికి క్షురకుడు సమాధానం ఇస్తూ..బ్రహ్మాండంగా ఉంది మహారాజా, ప్రజలందరూ, రాజ్యమంతా సుఖ - సంతోసాలతో ఆనందంగా ఉందన్నారు మహారాజా.


రాజుగారు సభలో కొలువుదీర్చి ఉండగా మహామంత్రి, రాజా రాజ్యంలో కరువు ఎక్కువ అవుతుంది..మన ధాన్యాగారం నుండి ధాన్యము, కోశాగారము నుండి ధనము అత్యవసరంగా విడుదల చేయవలసినంది అని కోరగా..  ఆ మహారాజు ఏం మంత్రివర్యా మా రాజ్యం అంతా బ్రహ్మాండంగా ఉందని విన్నాను.. మీరేమో కరువు- కాటకాలంటున్నారని గద్దించి సభ చాలిస్తాడు.   విషయం అర్థం చేసుకున్న మహామంత్రి ఆ రాత్రికి భటులను మారు వేషంలో పంపి క్షురకుని ఇంట ధన-ధాన్యలను తస్కరిస్తారు.


మరునాడు రాజసేవకు వచ్చిన క్షురకుడు దిగాలుగా ఉండటం చూసిన మహారాజు క్షురుకుడిని అడుగుతాడు..మా రాజ్యం ఎలా ఉంది అని,  దానికి క్షురకుడు ఏం రాజ్యం, ఏం లోకం మహారాజా ఎక్కడ చూసినా ఏడుపులు, మొత్తుకోళ్లు, కరువు, దరిద్రం.. అస్సలు ఇదీ ఒక రాజ్యమేనా అన్నట్లుందని అంటాడు.
మహారాజు కోపంగా ధూర్తుడా..నిన్ననేమో బ్రహ్మాండం అన్నావు - నేడేమో శ్మశానం అంటున్నావు...నీకిప్పుడే శిరచ్ఛేదం చేస్తానని అంటుండగా మహామంత్రి వచ్చి మహరాజా..


అల్పుర ప్రవంచమెప్పుడూ వారి జీవితం అంత మాత్రమే, వీని ఇంట ధన-ధాన్యలుంటే రాజ్యమంతా ఉన్నట్లని..వీని ఇంట వ్యక్తిగత బ్బందులుంటే రాజ్యమంతా శ్మాశానం అనుకునే అల్పుర మాటలు వింటే రాజ్యానికి చేటు..ఈ అల్పుడివి దయచేసి వదిలేయండా అని నచ్చజెపుతాడు. 


ఏనాడో పెద బాలశిక్షలో చదువుకున్న కతను మరీ - మరీ గుర్తు చేసుకుంటున్నారు ఆంధ్రప్రజ ఇప్పుడు.  చంద్రబాబు గారికి నచ్చనపుడు బీజేపీ ఆంధ్రదేశానికి మంచి పార్టీ...తెదేపాకి, బాబు గారికి నచ్చని నాడు బీజేపీ ఆంధ్ర దేశానికి శత్రువు.


చంద్రబాబు కి నచ్చనినాడు సోనియా గాంధీ ఇటలీ దెయ్యం.. చంద్రబాబుకి, తెదేపాకి నచ్చిన నాడు సోనియాగాంధీ దేవత, రాహూల్ గాందీ ఆంధ్రదేశాన్ని కాపాడేగలిగే  ఒకే ఒక దేవదూత అని ఆంధ్రదేశమంతా అనుకోవాలి.


ఏతా..వాతా ఆరు కోట్ల పైగా ఉన్న మాకు ఒక బుర్ర, దానిలో ఆలోచన..మాకంటూ ఒక వ్యక్తిత్వం..దానికింటూ అభిప్రాయాలు ఉండవన్నటులు..చంద్రబాబు, తెదేపా చెప్పినట్లుగా.. మా మా దేవుళ్ళని, మామా దెయ్యాలను మేము మార్చుకోవాలా అని అడుగుతున్నారు ఆంధ్రప్రజ.


నెలక్రితం కేసీఆర్ గారి పొత్తుకోసం వెంపర్లాడాను, కేసీఆర్ ఛీ పొమ్మన్నాడన్నపుడు కేసీఆర్ వేసిన కేసులు, ఇబ్బందులు చంద్రబాబు, తెదేపా మర్చిపోయారా? ఒక వేళ కేసీఆర్ పొత్తు ఒప్పుకొని ఉంటే ఈ పాటికి తెలుగు వాళ్ళు మనం - మనం..భాయీ - భాయీ అంటూ ఆంధ్రప్రజందర్నీ అటు తోలేవాడేమో.. అంటు విస్తుతపోతున్నారు ఆంధ్రప్రజ.


తమ ఇబ్బందులను ప్రజల మీద రుద్ది, తమ ఇష్టా, ఇష్టాలను ప్రజలవిగా మార్చి చూపిస్తూ ఉన్న నాయకులకు ప్రజాస్వౌమ్యం చెప్పాల్సిన విదంగా బుద్ది చెబుతుందంటున్నారు ప్రతిపక్ష నేతలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: