ఎన్నికల సమయంలో టీడీపీ అనుకూల మీడియా ఆ పార్టీని గెలిపించేందుకు నానా తంటాలు పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. . లేని సర్వేలను సృష్టించి తెలుగుదేశం గెలవబోతోంది అంటూ హైప్ క్రియేట్ చేసే పనిలో పడిందని అంటున్నారు. అందులో భాగంగానే ఆంధ్రజ్యోతి పత్రిక ఆ మధ్య లోక్‌ నీతి అని ఓ సర్వే ఫలితాలు ప్రకటించింది. 


ఆ తర్వాత ఆ సంస్థ.. అది తమ సర్వే కాదని ప్రకటించడంతో మళ్లీ సవరణ వేసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. అయినా సరే పట్టువిడువని ఆ పత్రిక.. తాజాగా మరో సర్వే ప్రచురించింది. కార్పొరేట్ చాణక్య పేరుతో సర్వే విడుదల చేసింది. టడీపీ గెలుస్తోందంటూ టీవీలోనూ, పేపర్లలోనూ ఊదరగొట్టింది. 

అయితే ఈ రెండో సర్వే కూడా బోగసేనని తెలుస్తోంది. ఈ సర్వేపై మిషన్ చాణక్య  సంస్థ మండిపడింది. తమ ట్రాక్ రికార్డును వాడుకుని, తమ పేరు మార్చి ఆంద్రజ్యోతి ఇలా తప్పుడు సర్వే ప్రచారం చేసిందని ఆ సంస్థ మండిపడింది. దొంగ సర్వేలను ప్రచురించమే కాకుండా.. తమ ట్రాక్‌ రికార్డును సైతం కాపీ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఆంధ్రజ్యోతి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందని వెల్లడించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. మిషన్‌ చాణక్యకున్న ట్రాక్‌రికార్డును.. కొర్పొరేట్‌ చాణక్య అనే లేని సంస్థకు ఆపాదించడం ప్రజలను తప్పుదారి పట్టించడమే అవుతుందని తెలిపింది. .ఆంధ్రజ్యోతి పత్రికలో ఎవరీ చాణక్య అంటూ ప్రచురించిన ట్రాక్‌ రికార్డు వాస్తవానికి మిషన్‌ చాణక్యదని స్పష్టం చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: