ఏపీలో సాధారణ ఎన్నికలకు మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రచార గడువు ముగిసేందుకు మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రలోభపెట్టడం ఎందుకు డబ్బు పంపిణీ ప్రారంభమయింది. డబ్బు పంపిణీ లో అధికార టిడిపి నేతలు కట్టలు కట్టలు వెదజల్లుతున్నారు. రాజధాని జిల్లా గుంటూరులో చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఏటికి ఎదురీదుతూ ఉన్నారు. రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న టిడిపి సీనియర్నే తల్లో ఇద్దరు ముగ్గురు నేతలు ఈ ఎన్నికల్లో ఓడిపోక తప్పదని ఫ్రీ పోల్ సర్వేలు, రాజకీయ విశ్లేషకుల అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.


ఈ క్రమంలోనే ఆంధ్రా ప్యారిస్ గా పేరున్న ఓ నియోజకవర్గంలో లో ఎక్కడా ఖాళీ స్థలం కనపడితే ఆ స్థలాన్ని కబ్జా చేసుకుంటూ పోతున్న ఆ టిడిపి భూ కబ్జా రాయుడిని ఓడించేందుకు నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. గతంలో మంత్రిగా కూడా పని చేసిన సదరు సీనియర్ నేత ఇప్పుడు వివాదాలకు అతి దగ్గరగా ఉంటారు. రౌడీయిజం, దండాయిజం, గుండా గిరి లాంటి పదాలు ఆయనకు ప్రతిరోజు నిత్యకృత్యం. రాజధాని ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఐదేళ్లలో  జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యం. ఈ నియోజకవర్గ కేంద్రమైన పట్టణములో రెండు సామాజిక వర్గాలకు చెందిన నిరుపేదల భూములను సదరు భూకబ్జా రాయుడు ఇష్టం వచ్చినట్టు లాగేసుకోవడంతో పాటు వారిపై బెదిరింపులకు దిగినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.


ఐదేళ్లలో ఆ కబ్జా రాయుడు నియోజకవర్గానికి కొత్తగా నిధులు తెచ్చి చేసిన అభివృద్ధి ఏం లేదు సరికదా అంతకుముందు ఐదేళ్లపాటు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ఓ కీలక పదవుల్లో ఉన్న నేతలు నిధులను సైతం ఖర్చు పెట్టలేక పోయారు. దీనిని బట్టి ఆ టిడిపి కబ్జా రాయుడికి అక్రమ సంపాదన, అవినీతి మీద ఉన్న దృష్టి నియోజకవర్గ అభివృద్ధి ప్రజల మీద ఏమాత్రం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుండడంతో నియోజక వర్గ ప్రజల్లో గత ఎన్నికల్లో ఈ కబ్జా రాయుడుకి ఓటు వేసిన వారిలో చాలామంది ఇది ఈ సారి ఇ ఆలోచన చేస్తున్నారు.


ప్రశాంతతకు మారుపేరు అయిన ఈ నియోజకవర్గం నుంచి ఎంతోమంది మహామహులు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వారు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు స్పీకర్ గా పనిచేసిన వారు కూడా ఉన్నారు అలాంటి నియోజవర్గంలో ప్రశాంత పాలన కోరుకుంటున్నామని ఆ కబ్జా రాయుడు పెత్తనానికి ఈ ఎన్నికలతో ఫుల్స్టాప్ పెట్టి వేస్తామని నియోజకవర్గ జనాల్లో ఒకటే చర్చ నడుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: